/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/babu-1-jpg.webp)
Chandrababu Protest Continues In Vijayawada : విజయవాడ(Vijayawada) లో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) కు నిరసన సెగ తగిలింది. విజయవాడ వెస్ట్(Vijayawada West) టిక్కెట్ జలీల్ ఖాన్(Jaleel Khan) కు ఇవ్వాలని మైనార్టీలు నిరసన చేపట్టారు. నగరంలో ఏ - కన్వెన్షన్ హాల్లో(A-Convention Hall) టీడీపీ వర్క్‌షాప్‌కు వెళ్లిన చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆయన అనుచరులు. పొత్తుల్లో భాగంగా వెస్ట్ సీటు బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో మైనార్టీలకే వెస్ట్ సీటు కేటాయించాలని జలీల్ వర్గం డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానంటూ గతంలో జలీల్ ఖాన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.