Nellore: నెల్లూరు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ మూడో రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా రొట్టెల పండుగ ఏర్పాట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో వర్చువల్ ద్వారా వీక్షించారు. అనంతరం భక్తులతో లైవ్‌లో మాట్లాడారు. రొట్టెల పండుగ ఘనచరిత్రను క్లుప్తంగా వివరించి, పండగ గొప్పతనంపై భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. దర్గా అభివృద్ధికి రూ. 5 కోట్లు మంజూరు చేశారు. భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ గా రొట్టెల పండుగను నిర్వహించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని చంద్రబాబు తెలిపారు.
Also Read: పాడె మోసి గురు భక్తిని చాటుకున్న మాజీ మంత్రి కాకాణి..!
బారాషహీద్ దర్గాలో ఏర్పాటు చేసిన వీడియో వర్చువల్ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి దర్గా వద్ద స్నానాల ఘాట్ల్ వద్ద, ప్రార్థనా మందిరాలవద్ద, సుమారు 10 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశామని మంత్రులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్‌లు పాల్గొన్నారు.