Uttam Kumar Reddy: వారిని వదిలిపెట్టం.. కాళేశ్వరంపై ఉత్తమ్ వార్నింగ్

కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయమై నాసిరకం పనులకు కారణమై ప్రజాధనాన్ని వృధా చేసిన వారిపై చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన ఎల్‌అండ్‌టి సంస్థ ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

Uttam Kumar Reddy: వారిని వదిలిపెట్టం.. కాళేశ్వరంపై ఉత్తమ్ వార్నింగ్
New Update

Uttam Kumar Review on Medigadda Issue: మేడిగడ్డ బ్యారేజ్‌ పనులపై సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌ (Uttam Kumar Reddy) సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎల్‌అండ్‌టి సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. అదిపెద్ద ప్రాజెక్ట్ లో నాణ్యత ఎందుకు లోపించిందని L&T ప్రతినిధులపై ఉత్తమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం పనులకు కారకులను వదిలేది లేదని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రజాధనాన్ని వృధా చేసిన వారిపై చర్యలు ఉంటాయని మంత్రి అన్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Congress PAC Meeting: ఎన్నికల తర్వాత నేడు తొలిసారి కాంగ్రెస్ పీఏసీ భేటీ.. వారికి ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు?

మేడిగడ్డపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉత్తమ్‌ కుమార్‌ ఆదేశించారు. నిన్న తన నివాసంలో మేడిగడ్డపై సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) సమీక్షించారు. సీఎం ఆదేశాలతో మేడిగడ్డపై నేడు ఉత్తమ్‌ మరోసారి సమీక్ష చేశారు. మేడిగడ్డ బ్యారేజ్‌లో (Medigadda Barrage) నాణ్యతా లోపాలను గుర్తించిన ప్రభుత్వం నాణ్యతా లోపాలకు కారకులను గుర్తించే పనిలో పడింది.

అవసరమైతే మేడిగడ్డపై విచారణకు ఆదేశిస్తామని ఇటీవల శాసనమండలిలో సీఎం రేవంత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. వేల కోట్లు ఖర్చు పెట్టినా మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోవడంపై ప్రభుత్వం సీరియస్‌ గా ఉంది. ఎన్నికల సమయంలోనూ మేడిగడ్డ బ్యారేజ్‌ వివాదం కీలకంగా మారింది. అక్టోబర్‌ 21న మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగింది. బ్యారేజీ 20వ పిల్లర్‌ కుంగడంతో ప్రమాదం చోటు చేసుకుంది.

#telangana-congress #mp-uttam-kumar-reddy #uttam-kumar-reddy #medigadda-barrage
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe