UttamKumarreddy : ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన..!

ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను తప్పక కొనుగోలు చేస్తామన్నారు. గాంధీ భవన్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచామన్నారు.

New Update
UttamKumarreddy : ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన..!

UttamKumarreddy :  వరి ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను తప్పకుండా కొనుగోలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచామని, గతేడాది కంటే ఈ ఏడాది వారం రోజులు ముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే 6919కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు.

గతేడాది ఏప్రిల్ 1 నాటికి కేవలం 339 కొనుగోలు కేంద్రాలు మాత్రమే తెరిచారని..గతేడాది..ఏప్రిల్ 15 నాటికి సిద్ధిపేట జిల్లాలో ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా తెరవలేదన్నారు. కానీ ఈ ఏడాది మాత్రం సిద్ధిపేట జిల్లాలో ఇవాళ్టికి 418 కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నట్లు మంత్రి వివరించారు. కొన్ని కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో రైతులకు కనీస మద్దతు ధర కంటే రేటు వస్తుందన్నారు. ధాన్యం ఎక్కువ చోట అదనపు కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు అధికారులకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సూచించారు.

ధాన్యం ఎక్కువ ధరకు కొనుగోలు చేసి తక్కువ ధరకు అమ్మారు అంటున్నారని..గతంలో 7వేల కోట్ల పెట్టు కొనుగోలు చేసి 2వేల నష్టానికి కొనుగోలు చేసిన విషయం గుర్తు చేశారు.వ్యవసాయ ఉత్పత్తులలో లాభనష్టాల ను చూడకుండా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం చూస్తుందనిచెప్పారు. గత ప్రభుత్వం ఎక్కువ నిల్వ ఉన్న యసంగి ధాన్యం కొనుగోలు చేశారన్నారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన సన్నిహితులు.. కాంగ్రెస్ లో చేరిన సొంత జిల్లా నేతలు!

Advertisment
తాజా కథనాలు