Minister Usha Sri Charan Comments: తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడిలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏపీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడిల డిమాండ్ లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. సమ్మె విరమించి విధులకు హాజరు కావాల్సిందిగా అంగన్వాడీ లకు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే మొత్తాన్ని లక్షకు పెంచినట్లు తెలిపారు. ఉద్యోగ విరమణ వయసును కూడా 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.గతంలో తెలంగాణకు సమానంగా వేతనాలు ఇవ్వాలనీ కోరిన వెంటనే రూ.11,500 కు వేతనాలు పెంచామన్నారు. పదోన్నతి వయస్సు ను 45-50 కి పెంచామని తెలిపారు.
Also Read: క్రిస్మస్ తాత వేషంలో మంత్రి రోజా..ఏం చేశారంటే.!
అంగన్వాడిల సమ్మె కారణంగా బాలింతలు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అర్హతను బట్టి అంగన్వాడీ లకు సంక్షేమ పథకాలు ఇస్తున్నట్లు చెప్పారు. అయితే, అంగన్వాడీ లకు గౌరవ వేతనం పెంచేందుకు ఇది సరైన సమయం కాదన్నారు. ఈ క్రమంలోనే అంగన్వాడీ కేంద్రాల తాళాలను ఎవరూ పగుల కొట్టలేదని స్పష్టం చేశారు. ఆయా జిల్లా కలెక్టర్ లు కేంద్రాలను నడిపెలా చర్యలు తీసుకున్నారని కామెంట్స్ చేశారు మంత్రి ఉషశ్రీ చరణ్.
Also read: పబ్లిక్ ఫిగర్ నే కానీ ఎవరూ ప్రేమించలేదు.. వెక్కి వెక్కి ఏడ్చాను
ఇక పొలిటికల్ విషయాలు మాట్లాడుతూ..సీటు విషయంలో నేను ఇంతవరకూ సీఎం ను కలవలేదని చెప్పారు. సీఎం గారిది చాలా పెద్ద మనసని..ప్రజల కోసం ఆయన మళ్లీ రావాలని ఆశభావం వ్యక్తం చేశారు. పేదలకు జగన్ పాలన ఒక శ్రీరామ రక్ష అంటూ వ్యాఖ్యనించారు. సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది సీఎం నిర్ణయమని ఆయన ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటానని తెలిపారు.