/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Minister-Thummala-Nageswara-Rao.jpg)
Minister Thummala: పెద్దవాగు ఘటన బాధాకరం అని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పెద్దవాగు ప్రాజెక్ట్ ఆనకట్ట తెగిన సమాచారం తెలియగానే ఎంతో తల్లడిల్లిపోయాయని అన్నారు. హెలి కాఫ్టర్ ఆలస్యం అయితే ఏమైనా ప్రాణ నష్టం వాటిల్లిందని ఎంతో మథన పడినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పంపే హెలి కాఫ్టర్ ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో ఏలూరు నుంచి రప్పించాం అని అన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ లు అప్రమత్తంగా ఉండటం తో వరదలో చిక్కిన 38 మందిని రక్షించడం జరిగిందని అన్నారు.
ప్రాజెక్ట్ ఆనకట్ట తెగడం వల్ల రైతులకు అపార నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. పెద్దవాగు ప్రాజెక్ట్ వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం అని అన్నారు. 1989 లో ప్రాజెక్ట్ ఆనకట్ట తెగిందని... ఇది ఉమ్మడి రాష్ట్రం ప్రాజెక్ట్ అని చెప్పారు. గత ప్రభుత్వాల కో ఆర్డినేషన్ లేదని విమర్శించారు. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత లో అధికారుల నిర్లక్ష్యం తేలిందని.. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.