/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/THUMMALA--jpg.webp)
Thummala Nageswara Rao: యశోద ఆసుపత్రిలో గొంతు ఇన్‌ఫెక్షన్‌తో చికిత్స పొందుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని (Komati Reddy Venkat Reddy) ఈ రోజు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. వైద్య పరీక్షల అనంతరం మంగళవారం రాత్రి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు వెంకట్‌రెడ్డి.
ALSO READ: పార్లమెంట్ లో దాడి.. లోక్ సభ స్పీకర్ కీలక నిర్ణయం!
వెంకట్‌రెడ్డిని పరామర్శించిన మంత్రి తుమ్మల అదే ఆసుపత్రిలో (Yashoda Hospital) చికిత్స తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ (KCR) ను పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వరాల సమయం పడుతుందని వైద్యులు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ తొందరగా కోలుకొని ప్రజల్లోకి రావాలని అన్నారు.
కేసీఆర్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న కేసీఆర్ ను హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) పరామర్శించారు. బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఅర్ గారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఈ రోజు హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని కలవడం జరిగింది.
బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఅర్ గారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ 👏🏻#GetWellSoonKCRpic.twitter.com/51bw34ViWK
— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) December 13, 2023
ALSO READ: BREAKING: భట్టి అధికారిక నివాసంగా ప్రజా భవన్