TG: రైతులపై చేయి చేసుకోబోయిన మంత్రి తుమ్మల.. క్రమశిక్షణ లేకపోతే ఎలా అంటూ..

మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు నిరసన సెగ తగిలింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలంటూ రైతులు నిరసన చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ దగ్గర తుమ్మలను అడ్డుకున్నారు. రైతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తుమ్మల చేయి చేసుకోబోయారు. దీంతో రైతులు, తుమ్మలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

TG: రైతులపై చేయి చేసుకోబోయిన మంత్రి తుమ్మల.. క్రమశిక్షణ లేకపోతే ఎలా అంటూ..
New Update

Khammam: బేషరుతుగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట వామపక్ష రైతు సంఘాలు ఆందోళన చేపట్టాయి. కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ ముగించుకుని బయటకు వస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కాన్వాయ్ ను రైతులు అడ్డుకున్నారు.

Also Read: తాడిపత్రిలో సొంత పార్టీ నేతలకు జేసీ వార్నింగ్..!

రైతుల నిరసనపై మంత్రి తుమ్మల అసహనం వ్యక్తం చేశారు. రైతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తుమ్మల చేయి చేసుకోబోయారు. క్రమశిక్షణ లేకపోతే ఎలా బతుకుతారంటూ రైతులపై తుమ్మల ఫైర్ అయ్యారు. దీంతో రైతులు, తుమ్మలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది.


Also Read: కవిత ఎక్కడికీ పారిపోరు.. సిసోడియా బెయిల్ అంశాలే ఆమెకు వర్తిస్తాయి: ముకుల్ రోహత్గీ

నిరసనలు చేసే సమయం ఇంకా రాలేదంటూ ఆందోళనకారులకు బదులిచ్చారు. రుణమాఫీ సమస్యను క్యాబినెట్లో ఇప్పటికే మాట్లాడమని మంత్రి తుమ్మల తెలిపారు. వ్యవసాయ శాఖ సర్వే అనంతరం రుణమాఫీ పొందని వారి జాబితాను పరిశీలించి మాఫీ చేస్తామని ప్రకటించారు.

#minister-thummala
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe