Minister Seethakka: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బడ్జెట్ పై విమర్శలు చేయడంపై కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. కేంద్ర బడ్జెట్ పై స్పందించని కేసీఆర్, రాష్ట్ర బడ్జెట్ మీద మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్ ను నిరసిస్తూ అసెంబ్లీ తీర్మానం చేస్తే కేసీఆర్ ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ పై మాట్లాడని కేసీఆర్... రాష్ట్ర బడ్జెట్ ను విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం అన్నారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే అసెంబ్లీ కి వచ్చిన మొదటి రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ మెప్పుకోసమే కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ ను విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు.
Minister Seethakka: బీజేపీ మెప్పు కోసమే.. కేసీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్
TG: మాజీ సీఎం కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే అసెంబ్లీకి వచ్చిన మొదటి రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారని అన్నారు. బీజేపీ మెప్పుకోసమే కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్‌ను విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు.
New Update
Advertisment