Ration Cards: కొత్త రేషన్ కార్డులపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

TG: కొత్త రేషన్ కార్డులపై మంత్రి సీతక్క అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. పెన్షన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల నుంచి అర్హుల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని సెర్ఫ్‌ అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే.

Minister Seethakka: బీజేపీ మెప్పు కోసమే.. కేసీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్
New Update

Ration Cards: కొత్త రేషన్ కార్డులపై మంత్రి సీతక్క అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. పెన్షన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల నుంచి అర్హుల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని సెర్ఫ్‌ అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్‌), మహిళా శిశు సంక్షేమ శాఖపై సీతక్క సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం సెర్ఫ్‌ ద్వారా అమలవుతున్న పథకాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గత ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్లు ఇవ్వకపోవడంతో కేంద్రం పథకాలను వినియోగించుకోలేక పోయామని అధికారులు మంత్రి సీతక్కకు వివరించారు. మ్యాచింగ్‌ గ్రాంట్లకు నిధులు కేటాయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కేంద్రం పథకాలను వినియోగించుకునేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. వచ్చే బడ్జెట్‌లో మహిళాశక్తికి అవసరమైన నిధులు కేటాయిస్తామని అన్నారు.

అభయహస్తం పథకాన్ని అమలు చేయకుండా, మహిళల పొదుపు సొమ్మును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని మండిపడ్డారు. సంబంధిత వివరాలను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యత లేని గుడ్లు పంపిణీ కావడంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్లతోపాటు ఇతర వస్తువుల నాణ్యతపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు అందించాలని అన్నారు.

#minister-seethakka
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe