Andhra Pradesh: అప్పుడేం చేశారు.. నారా లోకేష్ పై మంత్రి విడదల రజని సంచలన కామెంట్స్..

నారా లోకేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి విడదల రజని. ప్రభుత్వం ప్రజలకు వైద్యాన్ని చేరువ చేస్తుంటే.. లోకేష్ మాత్రం హేళన చేస్తూ మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో అనారోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని.. సీఎం జగన్ వచ్చాక ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని అన్నారు.

New Update
Andhra Pradesh: అప్పుడేం చేశారు.. నారా లోకేష్ పై మంత్రి విడదల రజని సంచలన కామెంట్స్..

Minister Rajini: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని(Minister Rajini) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శిస్తున్న లోకేష్(Nara Lokesh).. నాడు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏం చేశారని ప్రశ్నించారు. సుమారు రూ. 6 కోట్ల ప్రభుత్వ నిధులతో ఆధునీకరించిన గోపాలపట్నంలోని 30 పడకల ఆస్పత్రిని, కొత్తపాలెంలో రూ. 2 కోట్లతో నిర్మించిన విలేజ్ క్లినిక్‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి విడదల రజని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి విడదల రజని.. జగన్ సీఎం అయ్యాక ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖపై దృష్టి పెట్టిందన్నారు. నేడు ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందన్నారు.

ఇదే సమయంలో జగనన్న ఆరోగ్య కేంద్రాలను అవహేళన చేస్తూ లోకేష్ మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఆనాడు టీడీపీ ప్రభుత్వ హయాంలో వైద్య రంగానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలో ఆరోగ్య రంగాన్ని అనారోగ్య రంగంగా చేస్తే.. ఇప్పుడు సీఎం జగన్ వచ్చాక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దారని పేర్కొన్నారు మంత్రి రజని.

Also Read: రేపే బండి సంజయ్ నామినేషన్.. ప్రకాష్ జవదేకర్, రాజాసింగ్ రాక..

రాష్ట్ర ప్రజలకు వైద్యసేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో విలేజి క్లినిక్‌లు, అందులో మందులు, మంచి డాక్టర్లను ఏర్పాటు చేసి.. ప్రజల ఇంటి వద్దే వైద్యాన్ని అందిస్తున్నామని అన్నారు. ప్రజలకు ఓవైపు విద్య, వైద్యంతో పాటు సంక్షేమ పథకాలను అందిస్తూ ముందుకు వెళుతుంటే.. లోకేష్ వంటి వ్యక్తులు మాత్రం అడ్డుతగులుతున్నారని అన్నారు. ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలకు అడ్డు తగులుతూ.. కుయుక్తులు పన్నుతున్నారంటూ లోకేష్‌పై మండిపడ్డారు. టీడీపీ నేతల కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు మంత్రి రజని.

Also Read: కేసీఆరే మంచోడు.. ఎంపీ అరవింద్ షాకింగ్ కామెంట్స్..

Advertisment
Advertisment
తాజా కథనాలు