Hyderabad : అలాంటి పనిచేసిన ఏకైక ప్రధాని మోడీనే.. పొన్నం సెటైర్లు!

తెలంగాణ రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలేనని కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చేనేతపై జీఎస్టీ వేసిన ఏకైక ప్రధాని మోడీనే అంటూ విమర్శించారు. స్వార్థ రాజకీయాలకోసం సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీయొద్దని కోరారు.

New Update
Ponnam Prabhakar: హుస్నాబాద్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌దే

Ponnam Prabhakar : బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) పార్టీలతోపాటు ప్రధాని మోడీ(PM Modi) పై కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సిరిసిల్లకు క్లస్టర్ అడిగితే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయలేదంటూ విమర్శలు గుప్పించారు.

ఇది కూడా చదవండి: Miss Universe 2024: మిస్ యూనివర్స్ గా 60ఏళ్ల మహిళ.. రికార్డ్ క్రియేట్ చేసిన రోడ్రిగ్జ్!

ఏకైక ప్రధాని మోడీనే..
అలాగే పార్టీ ఏదైనా సరే శవ రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. 'చేనేతపై జీఎస్టీ వేసిన ఏకైక ప్రధాని మోడీనే. కేటీఆర్ సిరిసిల్ల కార్మికుల జీవితాలను నిజంగా బాగు చేసివుంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. స్వార్థ రాజకీయాలకోసం సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీయొద్దు' అని కోరారు. అలాగూ చేనేత కార్మికులు ఎవరూ అధైర్య పడొద్దన్నాడు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు