Karimnagar : జిల్లాల పునర్విభజనపై పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్, బీజేపీకి సవాల్

తెలంగాణ జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాభిప్రాయం మేరకు మరోసారి జిల్లాల, నియోజకవర్గాల, మండలాల పునర్విభజన జరగాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రత్యేక కమిటీ వేసి నూతన ప్రణాళికను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు.

Telangana: తెలంగాణ వ్యతిరేకులకే ప్రగతి భవన్ లో రెడ్ కార్పేట్ వేశారు.. పొన్నం ప్రభాకర్
New Update

Ponnam Prabhakar: తెలంగాణలోని జిల్లాల పునర్విభజనపై రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల అభిప్రాయాలు సేకరించకుండా కొంతమంది ప్రయోజనం కోసం హాడావుడిగా కొత్త జిల్లాలను ప్రకటించారన్నారు. ఆదివారం కరీంనగర్ లో మీడియా చిట్ చాట్ పాల్గొన్న ఆయన.. ఇది పూర్తిగా అశాస్త్రీయమైనదంటూ గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

పూర్తి అశాస్త్రీయం..
జిల్లాల పునర్విభజన పూర్తి అశాస్త్రీయంగా జరిగింది. ప్రజల అభిప్రాయాల మేరకు మరోసారి జిల్లాల, నియోజకవర్గాల మండలాల పునర్విభజన జరగాల్సిన అవసరం ఉంది. జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం మరోసారి ఆలోచన చేస్తుంది. ఇందుకోసం ఒక ప్రత్యేక కమిటీ వేసి త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రణాళికను విడుదల చేసి.. ప్రజలు కోరుకున్న విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.

ఎడమ కాలు చెప్పుతో సమానం..
ఇక ఆర్టీసీ (TSRTC)ని గత ప్రభుత్వం చంపేసిందని చెప్పిన ఆయన.. త్వరలోనే ఆర్టీసి ప్రయాణీకుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అన్యాయానికి గురైన వారు ఫిర్యాదు చేయాలని, వాటిపై చర్యలు చేపడతామని క్లారిటీ ఇచ్చారు. ఇక కేసీఆర్ పదానికి పూజ చేసుకోవాలని బీఆర్ఎస్ (BRS) నాయకులకు సూచించారు. సీఎం పదవి ఎడమ కాలు చెప్పుతో సమానం అని తండ్రి అంటే.. కొడుకు సీఎం పదం కంటే కేసీఆర్ పదం పవర్ అంటాడని ఎద్దేవా చేశారు. జీవితంలో ఎప్పుడూ కూడ బీజేపీ(BJP), కాంగ్రెస్ (Congress) కలిసి పని చేయవని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ లపై కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్.. అక్కడ కూర్చొని రిమోట్ నొక్కారంటూ

బండి‌ సంజయ్ పై ఆగ్రహం..
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని బండి‌ సంజయ్ (Bandi Sanjay) చేసిన కామెంట్స్ పై మాట్లాడుతూ.. బండి జ్యోతిష్యం చెప్పినట్లుగా అనిపిస్తుందని సెటైర్లు వేశారు. వైఫల్యం చెందిన ఎంపీలలో బండి‌సంజయ్ నంబర్ వన్ అన్నారు. దేశం కోసం ఎవరు ఏం చేశారో తెలుసని, దేశ సంపద కాంగ్రెస్ సృష్టిస్తే బిజేపి అమ్ముతుందన్నారు. పెళ్ళాం పుస్తెలు అమ్మి ఎన్నికల్లో కొట్లాడిన వ్యక్తి బండి సంజయ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చేశారని, పెద్దపెద్ద కటౌట్లు ప్లెక్సీలు పెట్టుకోవడానికి డబ్బులు ఎక్కడివి? అని ప్రశ్నించారు.

బీఅర్ఎస్ కు ధైర్యం లేదు..
ప్రభుత్వాన్ని కూలగొట్టే ధైర్యం బీఅర్ఎస్ కు లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం ఎవరూ చేయలేరని, జగథ్గురు చెప్పినగాని అశాస్త్రీయంగా అయోధ్య రామాలయం ప్రారంభిస్తున్నారని, ఇది ఎన్నికల స్టంటే అని బీజేపీపై విమర్శలు చేశారు. లింగ ప్రాణప్రతిష్ఠ ఎవ్వరూ చేయాలో తెలియదా? ఇది అరిష్టం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మాజీ ఎంపి వినోద్ కుమార్ కరీంనగర్ కి ఏం చేసాడో చెప్పాలని ప్రశ్నించారు.  కేసీఆర్, వినోద్ కుమార్, కేసీఆర్ లు ఎంపిలుగా ఏం అభివృద్ధి చేసారో, నేను ఎంపిగా ఏం చేసానో చర్చకి వస్తారా? అని సవాల్ విసిరారు. రాముడి కటౌట్లు పెట్టుకుని బీజేపి ఓట్లు అడుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ (KTR) అధికారం కోల్పోయిన అసహనం తో ఉన్నారని అన్నారు. సీఎం పదవి కన్నా కేసీఆర్ (KCR) పవర్ పుల్ అనేది భ్రమ అన్నారు. ఇక దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాలని పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కోరారు.

#karimnagar #ponnam-prabhakar #redistribution-of-districts
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe