Ponnam Prabhakar vs Kavitha : తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం హైదర్ గూడలోని న్యూ ఎంఎల్ఏ క్యార్తర్స్ లోని స్పీకర్ ను కలిసి కవిత వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే జాగృతి సంస్థ ద్వారా పోరాటం చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయించామని అన్నారు.ఇప్పుడు అదే స్పూర్తితో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఉద్యమిస్తాని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 11 న పూలే జయంతి లోపు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి విగ్రహం ఏర్పాటు చేస్తారని భావిస్తున్నామని అన్నారు.
‘‘అణగారిన జీవితాల్లో వెలుగుల దారులు పంచిన మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ మహనీయుడి విగ్రహం అసెంబ్లీలో ప్రతిష్టించాలని మీరు కోరడం మరీ విడ్డూరం. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు యాదికి లేని మహాత్మా జ్యోతిరావు పూలేను మీకు ఎరుక చేసిన తెలంగాణ ఓటర్ల చైతన్యానికి వందనం. అణచివేతకు వ్యతిరేకంగా పూలే సలిపిన పోరాటమే మా ప్రభుత్వానికి ఆదర్శం. ప్రగతి భవన్‌కు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టుకున్నాం, ప్రజా పాలన అందిస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే మాకు సర్వదా స్మరణీయుడు. బీసీలను వంచించిన మీరా బీసీల సంక్షేమం గురించి మాట్లాడేది?. మీ నియంతృత్వానికి ఎదురు తిరిగితే ఒక బీసీ మహిళ అని చూడకుండా జగిత్యాల మున్సిపల్ చైర్మన్‌ను ఏడిపించింది మీరు కాదా? బీసీ బిడ్డగా అడుగుతున్నా.. మీ నియోజకవర్గంలో ఎంతమంది బీసీలకు మీరు అధికారాలు ఇచ్చారు? బీసీ మంత్రిగా ఉన్నా.. నేను ఉద్యమకారుడినే.. అణగారిన వర్గాలకు ఆప్తున్ని, సబ్బండ కులాలకు సోదరుడిని. మంత్రిగా ఉండి బీసీల హక్కుల కోసం పోరాడతా. మీ పార్టీ అధ్యక్ష పదవి, కార్యనిర్వహక అధ్యక్ష పదవి, లీడర్ ఆఫ్ అపొజిషన్ బీసీలకు ఇవ్వగలరా? గత మీ ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మన్ బీసీలకు ఎందుకు ఇవ్వలేదు?’’అంటూ ఎక్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే ఎందుకు మీరు రాజకీయ రంగు పులుముతున్నారు ?
భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా? లేక అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా??
అసెంబ్లీలో… https://t.co/Eb6nPs2YN0
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 22, 2024
ALSO READ:రైతుబంధు జమ అయ్యేది అప్పుడేనా ?