Balkampet Yellamma Temple: మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మికి అధికారులు షాక్

TG: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ వేడుకలకు వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది. వీఐపీలు వచ్చినా సరైన సెక్యూరిటీ లేదని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించలేదని కోపంతో గుడిబయటే కూర్చున్నారు.

New Update
Balkampet Yellamma Temple: మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మికి అధికారులు షాక్

Balkampet Yellamma Temple: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ వేడుకలకు వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది. వీఐపీలు వచ్చినా సరైన సెక్యూరిటీ లేదని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ పై సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ పాటించలేదని కోపంతో గుడిబయటే కూర్చున్నారు మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి.

అధికారులతో మాట్లాడి ఏర్పాట్లపై అధికారులను నిలదీశారు మేయర్ విజయలక్ష్మి. ఈ క్రమంలో మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మికి అధికారులు సర్ది చెప్పారు. కాగా ఈరోజు ఎల్లమ్మ కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు మంత్రి కొండా సురేఖ. అమ్మవారి దర్శనానికి పలువురు కాంగ్రెస్ నేతలు వెళ్లారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణనోత్సవ ఏర్పాట్లపై విమర్శలు వస్తున్నాయి

Advertisment
తాజా కథనాలు