Minister Ponnam Prabhakar: ఉచిత బస్సు సౌకర్యాలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధాన మంత్రి స్థాయిలో జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయని వివరణ ఇచ్చారు. ఆర్టీసీలో ప్రయాణానికి.. మెట్రో ప్రయాణానికి సంబంధం లేదని అన్నారు.
ఇప్పటికీ కూడా మెట్రోలో బోగిలు పెంచాలని మెట్రో సంస్థకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. మోదీ రాజకీయ లబ్ధికి సంబంధించిన ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విషయంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదని స్పష్టత ఇచ్చారు. ఇంకా కొత్త బస్సులు పెంచి పథకాన్ని మరింత ముందుకు తీసుకుపోతాం అని అన్నారు. ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఎదో నష్టం జరుగుతున్నట్లు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఇలా చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధాన మంత్రి స్థాయి దిగజార్చవద్దని అన్నారు.