Jagan v/s Nimmala Ramanaidu : పాలకొల్లు (Palakollu) లో బీఆర్‌ఎంబీ మున్సిపల్ ఉన్నత పాఠశాలకు వెళ్లారు మంత్రి నిమ్మల రామానాయుడు. విద్యార్థులకు బ్యాగులు, దుస్తులు అందజేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు పరిశీలించి భోజనం చేశారు. భోజనం ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. టీడీపీ (TDP) ప్రభుత్వంలో విద్యకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. జగన్ (YS Jagan) అనాలోచిత నిర్ణయాలతో 6 లక్షల మంది ప్రాథమిక విద్యకు దూరమయ్యారని మండిపడ్డారు. జగన్ ఐదేళ్ల పాలనలో అప్పులు చేసి రాష్ట్రాన్ని అథోగతి పాల్జేశారని విమర్శించారు.
Also Read : ఆండ్రాయిడ్ ఫోన్‌లో AI చాట్‌బాట్‌లను ఇలా ఉపయోగించండి