ఇసుక విధానంలో లోటుపాట్లు సరిచేస్తాం
బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చేందుకు గత నాలుగు రోజుల నుంచి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గండ్లను పూడ్చేందుకు ఆర్మీ ఇంజనీర్ల బృందం కూడా రంగంలోకి వచ్చింది. ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీతో కలిసి ఆర్మీ బృందం బుడమేరు గండ్లు పూడ్చే పనుల్లో నిమగమైంది.
రాష్ట్రంలో సహకార సంఘాలు, రూరల్ బ్యాంకులను మాజీ సీఎం జగన్ నిర్వీర్యం చేశాడని ఆరోపించారు మంత్రి నిమ్మల రామానాయుడు. పాలకొల్లు మార్కెట్ యార్డులో ఆయన మాట్లాడుతూ.. జగన్ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులకు భద్రత లేదన్నారు.
AP: జగన్ అనాలోచిత నిర్ణయాలతో 6 లక్షల మంది ప్రాథమిక విద్యకు దూరమయ్యారని అన్నారు మంత్రి నిమ్మల. జగన్ ఐదేళ్ల పాలనలో అప్పులు చేసి రాష్ట్రాన్ని అథోగతి పాల్జేశారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో విద్యకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు.
AP: ఈరోజు సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు బాధ్యతలు చేపట్టారు. వైసీపీ పాలనలో పోలవరం నిర్మాణాన్ని అసలు పట్టించుకోలేదని విమర్శించారు. తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పోలవరానికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తామని తెలిపారు.