Nimmala Rama Naidu: జగన్‌ ఐదేళ్ల విధ్వంసం కనిపిస్తోంది.. మంత్రి నిమ్మల ఫైర్

AP: పాలకొల్లులో వంద పడకల ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. జగన్‌ ఐదేళ్ల విధ్వంసం ఆస్పత్రి నూతన భవన నిర్మాణాల్లోనూ కనిపించిందని అన్నారు. ఏడాదిలో పూర్తి కావాల్సిన పనులు ఐదేళ్లైనా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదని విమర్శించారు.

New Update
Minister Nimmala : సోమశిల జలాశయం ప్రమాదంలో ఉంది : మంత్రి నిమ్మల

Nimmala Rama Naidu: పాలకొల్లులో వంద పడకల ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. కొత్తగా చేపట్టిన భవన నిర్మాణ పనుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శ్లాబ్‌ నుంచి లీకవుతున్న వర్షపునీరు, నిల్వ ఉన్న నీటిని చూసి మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంటి నిర్మాణాలు ఇలాగే ఉంటాయా అంటూ అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వం మారిందని, పనులన్నీ నాణ్యతతో జరగాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు.

పాత ఆస్పత్రిలో రోగులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి నిమ్మల. జగన్‌ ఐదేళ్ల విధ్వంసం ఆస్పత్రి నూతన భవన నిర్మాణాల్లోనూ కనిపించిందని అన్నారు. ఏడాదిలో పూర్తి కావాల్సిన పనులు ఐదేళ్లైనా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదని విమర్శించారు. పనుల పరిస్థితిని కలెక్టర్‌, వైద్యారోగ్య శాఖ కమిషనర్‌కు ఫోనులో వివరించారు నిమ్మల.

Also Read: మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు