Minister Narayana: ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్యాంటీన్లు ఒకే విధంగా ఉండేలా డిజైన్ చేశామన్నారు. గత ప్రభుత్వం కక్ష సాధింపుతో అన్న క్యాంటీన్లు మూసివేసిందని.. అన్ని క్యాంటీన్లను నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రారంభించిన 183 అన్న క్యాంటీన్ లను ఆగస్టు 10 నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read: ఎంపీడీఓ మిస్సింగ్ పై డిప్యూటీ సీఎం సీరియస్.. అసలు కారణం ఇదే అంటున్న MPDO తనయుడు..!
ఈ క్రమంలోనే మాట్లాడుతూ.. ఇటీవల పిడుగురాళ్లలో డయేరియా కేసులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఉన్న 17 మున్సిపల్ కార్పొరేషన్లు మినహా మిగతా 106 ULB లకు 50 కోట్లు విడుదల చేశామన్నారు. డ్రైన్ లలో పూడిక తీత కోసం మాత్రమే ఈ నిధులు ఉపయోగించాలన్నారు. గత ప్రభుత్వం మున్సిపాలిటీల సాధారణ నిధులను కూడా ఇతర అవసరాలకు వాడేసిందన్నారు. దీంతో మున్సిపల్ శాఖ ఖజానా ఖాళీ అయిపోయిందన్నారు. చెత్త పన్నుపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.