Nadendla: తెనాలిలో మంత్రి నాదెండ్ల పర్యటన.. అధికారులకు కీలక సూచనలు..!

గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో కలిసి పర్యటించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. పంట కాల్వలు, డ్రైనేజీలు యుద్ధ ప్రాతిపాదికన శుభ్రం చేయాలని.. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

AP: ఇలా ఉండటం బాధాకరం.. ఇకపై ఈ పరిస్థితి ఉండదు:  మంత్రి నాదెండ్ల
New Update

Nadendla Manohar Visited Tenali: గుంటూరు జిల్లా తెనాలిలో అధికారులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన చేపట్టారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. పంట కాల్వలు, డ్రైనేజీలు యుద్ధ ప్రాతిపాదికన శుభ్రం చెయ్యాలని..అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

Also Read: పవన్ చాంబర్‌పై కొనసాగుతున్న కసరత్తు.. గతంకంటే భిన్నంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు.!

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. పంట కాలవలు, డ్రైనేజీలు పూడికతీత తీయకపోవడంతో రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రాబోయేది వర్షాకాలం కావడంతో యుద్ధ ప్రాతిపాదికన పూడికతీత పనులు చేపట్టామన్నారు. తెనాలిలో అండర్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. 45 కిలోమీటర్లు, ఎనిమిది ప్రధాన కాలువలను గుర్తించి పూడిక తీస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో తెనాలి అభివృద్ధికి కృషి  చేస్తానన్నారు.

#janasena #nadendla-manohar
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe