Nadendla: ఎవ్వరు తప్పు చేసినా క్రిమినల్ కేసులే.. మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక..!

కాకినాడ జిల్లాలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఆ శాఖ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన కౌలు రైతులకు న్యాయం చేసే దిశగా ఆలోచనలు చేయాలన్నారు. రేషన్ సరుకుల సరఫరాపై పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు.

Nadendla: ఎవ్వరు తప్పు చేసినా క్రిమినల్ కేసులే.. మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక..!
New Update

Minister Nadendla Manohar: కాకినాడ జిల్లాలో (Kakinada) పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్నారు. ఆ శాఖకు సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ షన్మోహన్, కాకినాడ ఎంపీ, కాకినాడ, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని.. వారికి న్యాయం చేసే దిశగా ఆలోచనలు చేయాలని అధికారులకు సూచించారు.

సరఫరాపై ఆరా..

రేషన్ సరుకుల సరఫరాపై పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి నాదెండ్ల. ప్రభుత్వ హాస్టల్, అంగన్ వాడీ సెంటర్లకు పౌర సరఫరా సరుకులు ఏ విధంగా సప్లై అవుతున్నాయని, పరివేక్షన ఎలా జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు. రేషన్ సరుకుల సరఫరాపై పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ హాస్టల్, అంగన్ వాడీ సెంటర్లను పౌర సరఫరా సరుకులు ఏ విధంగా సప్లై అవుతున్నాయని, పరివేక్షన ఎలా అని అడిగి తెలుసుకున్నారు.

Also Read: కానిస్టేబుల్ కనుసన్నల్లో ఎర్రచందనం అక్రమ రవాణా..!

సామాన్యుడిని..

మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ.. ప్రజలు తమ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. పౌర సరఫరాలో జరుగుతున్న కార్యక్రమాలు, తీసుకోబోయే నిర్ణయాలపై సమీక్ష నిర్వహించామన్నారు. క్షేత్ర స్థాయిలో సామాన్యుడిని ఆదుకునే విధంగా ఈ శాఖ పని చేస్తుందన్నారు. కౌలు రైతుల విషయంలో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. గత ప్రభుత్వం కౌలు రైతులకు ఎక్కువ అన్యాయం చేసిందన్నారు.

ఎవ్వరు తప్పు చేసినా..

ఈ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ పొరపాటు జరగకుండా చూసుకుంటామన్నారు. రేషన్ పంపిణి విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాకినాడ పోర్టును ఒక అడ్డగా మార్చుకుని ఒక కుటుంబానికి లబ్ధి చేకూరేలా మార్చేశారన్నారు. చిత్తూరు నుండి కాకినాడ వరుకు వ్యవస్థీకృత మోసాలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ద్వారంపూడి కుటుంబానికి లబ్ధి చేకూరేలా చేశారన్నారు. ఎవ్వరు తప్పు చేసినా క్రిమినల్ కేసులు పెడతామని..పౌర సరఫరాల శాఖలో 36 వేల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. రైతులకు 16 వందల కోట్లు బాకీలను మిగిల్చారన్నారు.

#minister-nadendla
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe