AP: కానిస్టేబుల్ కనుసన్నల్లో ఎర్రచందనం అక్రమ రవాణా..! కడప జిల్లా బసాపురం టోల్ ప్లాజా వద్ద ఫారెస్ట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కారులో తరలిస్తున్న 4 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకొని కారును సీజ్ చేశారు. అయితే, ఎర్రచందనం తరలింపులో ఓ కానిస్టేబుల్ పాత్రపై పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. By Jyoshna Sappogula 28 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Kadapa: ఎర్రచందనం అక్రమ రవాణా తరలింపుపై అధికారులు హైఅలర్ట్ అయ్యారు. చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తాజాగా, కడప జిల్లా బి.మఠం మండలం బసాపురం టోల్ ప్లాజా వద్ద ఫారెస్ట్ అధికారుల తనిఖీలు చేపట్టారు. కారులో తరలిస్తున్న 4 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. Also Read: హమ్మయ్య.. ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత..! ఒకరిని అదుపులోకి తీసుకొని కారును సీజ్ చేశారు అటవీ అధికారులు. పరారీలో ఉన్న మరికొందరు స్మగ్లర్లపై అధికారులు గాలింపు చర్యలు చేస్తున్నారు. అయితే, ఎర్రచందనం తరలింపులో ఓ కానిస్టేబుల్ పాత్రపై పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. బద్వేలు పి.ఎస్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పై అటవీ అధికారులు ఆరా తీస్తున్నారు. #kadapa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి