ఎన్నికల సమయంలో మంత్రి మల్లారెడ్డికి కొత్త తలనొప్పి పట్టుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి తన భూమిని ఆక్రమించారని దయాసాగర్ రెడ్డి, మర్రి వెంకట్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలోని మంత్రి మల్లారెడ్డి మెడికల్ కాలేజికి సమీపంలో ఉన్న సుంకరి కుటుంబానికి దాదాపు 9 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో తాము 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు దయాసాగర్ రెడ్డి, మర్రి వెంకట్ రెడ్డి తెలిపారు. కానీ తాము కొనుగోలు చేసిన భూమిలో రెండు ఎకరాల భూమి మంత్రి మల్లారెడ్డి ఆయన భార్య పేరు మీద కొనుగోలు చేసినట్లు తప్పుడు పత్రాలు చూపిస్తున్నారన్నారు.
పూర్తిగా చదవండి..మంత్రి మల్లారెడ్డికి కొత్త తలనొప్పి.. నిజమేనా..!
మంత్రి మల్లారెడ్డి తమ భూమిని కబ్జా చేశాడని ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ భూమిని మంత్రి కొనుగోలు చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారన్నారు. భూ రికార్డుల్లో తమపేర్లు లేకుండా చేశారని వారు ఆరోపించారు. తమ భూమిని తమకు ఇప్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
Translate this News: