Telangana Elections: ముస్లీంల కోసం కాంగ్రెస్ ఏమీ చేయలేదు: మహమూద్‌ అలీ

ముస్లీం ప్రజలకు కాంగ్రెస్‌ 50 ఏళ్లలో చేసిందేమీ లేదని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ఏడాదికి రూ.2,200 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నామని.. ఇది బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకంటే అనేక రేట్లు ఎక్కువని వెల్లడించారు.

New Update
Telangana Elections: ముస్లీంల కోసం కాంగ్రెస్ ఏమీ చేయలేదు: మహమూద్‌ అలీ

తెలంగాణలో ఈరోజు ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో నేతలు వివిధ వర్గాల ప్రజలతో సమావేశమవుతున్నారు. తాజాగా హోంమంత్రి మహమూద్‌ అలీ తెలంగాణ భవన్‌లో మైనార్టీ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి.. 50 ఏళ్లుగా కాంగ్రెస్ ముస్లీం ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలోనే సెక్యులర్ పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతోందని చెప్పారు. ముస్లీం బిడ్డల కోసం ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పేద ముస్లీం ఆడబిడ్డలకు షాదీ ముబారక్ అందిస్తున్నామన్నారు. అలాగే పేద విద్యార్థులకు విదేశీ విద్య అందిస్తున్నామని.. దాదాపు 3 వేల మంది విద్యార్థుల కోసం విదేశీ విద్యకోసం సహాయం చేశామని పేర్కొన్నారు.

Also read: బీజేపీ గెలిస్తే ఆయనే సీఎం.. మందకృష్ణ మాదిగ సంచలన ప్రకటన

మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్యకు రూ.20 లక్ష స్కాలర్‌షిప్‌ అందిస్తున్నామని.. ముస్లింలలో వృత్తిదారులకు రూ.లక్ష మైనార్టీ బంధు సాయం కూడా ఇస్తున్నామని పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ఏడాదికి రూ.2,200 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నామని.. ఇది బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకంటే అనేక రేట్లు ఎక్కువని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు మైనార్టీలకు అందుతున్నాయని పేర్కొన్నారు. కుల, మత భేదాలు చూడతుండా అన్ని వర్గాల కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టిందని చెప్పరు. రాష్ట్రంలో అన్ని మతాల వారి పండగలు ప్రశాంతంగా జరుగుతన్నాయని.. బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించి కేసీఆర్‌ను మళ్లీ మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని కోరారు.

Also read: గ్రేటర్ పరిధిలో కింగ్ మేకర్ ఎవరు?

Advertisment
తాజా కథనాలు