BREAKING: మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు AP: విద్యాశాఖ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు మంత్రి లోకేష్. ఎఐ వర్సిటీని రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎకో సిస్టమ్, ఇతర అంశాలపై అధ్యయనం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అకడమిక్ క్యాలెండర్ పక్కాగా అమలు చేయాలన్నారు. By V.J Reddy 08 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Minister Lokesh: ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి లోకేష్. ఏపీని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ హబ్ చేసేందుకు ప్రతిష్టాత్మక గ్లోబల్ యూనివర్సిటీ నెలకొల్పే అంశంపై అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఎఐ వర్సిటీని రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎకో సిస్టమ్, ఇతర అంశాలపై అధ్యయనం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఎఐ వర్సిటీ ద్వారా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, గవర్నెన్స్ వంటి 16రంగాల్లో సమర్థవంతమైన సేవలు అందించవచ్చని అన్నారు. విద్యారంగానికి సంబంధించి అధునాతన ఎఐ టెక్నాలజీ ద్వారా కెజి నుంచి పిజి వరకు విద్యార్థులకు స్టూడెంట్ పాస్ పోర్టు ఇచ్చేలా ఫ్రేమ్ వర్క్ రూపొందించాలని అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది నుంచి యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అకడమిక్ క్యాలెండర్ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఉన్నతవిద్య కార్యదర్శి సౌరబ్ గౌర్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ చార్జి చైర్మన్ రామ్మోహన్ రావు, కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, స్కిల్ డెవలప్ మెంట్ విసి అండ్ ఎండి గణేష్ కుమార్ పాల్గొన్నారు. #minister-lokesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి