Minister Lokesh: బుడమేరు గండి పూడ్చివేత పనులు 95 శాతం పూర్తి: లోకేష్

AP: బుడమేరు గండి పూడ్చివేత పనులు 95 శాతం పూర్తయినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఈరోజు పూడ్చివేత పనులను దేవినేని ఉమాతో కలిసి పరిశీలించారు. పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గండ్లను పూర్తిగా పూడ్చివేసి విజయవాడలోకి వరద నీరు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

New Update
Minister Lokesh: బుడమేరు గండి పూడ్చివేత పనులు 95 శాతం పూర్తి: లోకేష్

Minister Lokesh: విజయవాడ వరద తో అతలాకుతలానికి కారణమైన బుడమేరు గండ్లు పూడ్చివేత పనులను పరిశీలించారు మంత్రి లోకేష్. మూడో గండి పూడ్చివేత పనులను ఆయన పరిశీలించారు. పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బుడమేరు గండి పూడ్చివేత పనులు 95 శాతం పూర్తి అయినట్లు ఆయన చెప్పారు. త్వరలోనే గండ్లను పూర్తిగా పూడ్చివేసి వరదను నిలిపివేస్తాం అని అన్నారు. ప్రజలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.

బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు సమన్వయంతో జోరుగా సాగుతున్నాయని అన్నారు మంత్రి లోకేష్. మూడవ గండి పూడ్చివేత పనులు మొదలయ్యాయని చెప్పారు. డ్రోన్ లైవ్ ద్వారా సూచనలు ఇస్తూ పనులను పర్యవేక్షిస్తున్నానని అన్నారు. గండ్ల పూడ్చివేత పురోగతిపై మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్లతో కలిసి కమాండ్ కంట్రోల్ నుంచి సమీక్షించినట్లు తెలిపారు.

వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధికి తెనాలి బొమ్మినేని హాస్పిటల్ అధినేత బొమ్మినేని దుర్గారాణి రూ.15 లక్షలు, కాటూరి మెడికల్ కాలేజ్ యాజమాన్యం సిబ్బంది కలిపి 10లక్షలు, విజయవాడకు చెందిన ఎన్నారై డాక్టర్ శోభ ఆర్ పొదిల 10లక్షలు, బిజెపి సీనియర్ నేత పాతూరి నాగభూషణం సోదరుడు శ్రీనివాస్ 5లక్షలు, యలమంచిలి అరుణ 2 లక్షలు, ఎం మాధురీలత 1.5 లక్షలు, పాతూరి మధుసూదన్ రావు 1లక్ష, కోట వెంకట భాస్కరరావు 50 వేలు, వి.రామారావు 10 వేలు, సాయి ఫేస్ స్కాన్ సెంటర్ యజమాని అన్నపూర్ణ 25 వేలు, ప్రభుకుమారి 20వేలు, కవిత 5వేలు అందజేసినట్లు పేర్కొన్నారు. దాతలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు