Minister KTR: నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన

బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సహా పలువురు అధికారులు పాల్గొంటారు.

New Update
Minister KTR: నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన

పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

తెలంగాణ బీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ స్పీకర్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు సిరిసిల్ల పట్టణంలోని ఏర్పాటు చేసిన పాపన్న విగ్రహాన్ని కేటీఆర్‌ ఆవిష్కరించనున్నారు. రెండున్నర గంటలకు పద్మానాయక కల్యాణ మండపంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి కేటీఆర్‌ ప్రసంగించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు మానేరు బ్రిడ్జి వద్ద బోటు షికారును అధికారులతో కలిసి పరిశీలిస్తారు కేటీఆర్. సాయంత్రం 5 గంటలకు బైపాస్ రోడ్‌లో కొత్తగా నిర్మించిన కే కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించి.. జిల్లా ఏరియా ఆస్పత్రికి చేరుకొని 40 కేవీ రూట్ మ్యాప్, సోలార్ ప్లాంట్‌ను 130 అదనపు బెడ్స్, క్యాన్సర్ బాధితుల కోసం కీమోథెరఫీ, డేకేర్‌ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.

బోటులో షికారు

జిల్లాలో మానేరు వాగుతో పాటు రామప్ప గుట్టల నుంచి అయ్యప్ప ఆలయం వరకు పర్యటన కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. వాగు ఒడ్డుకు కరకట్టల నిర్మాణం నడుస్తున్నది. ఎడమవైపు కరకట్ట నిర్మాణం పూర్తి కావటంతో.. కుడివైపు కరకట్ట నిర్మాణ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. శ్రీ రాజరాజేశ్వరి జలాశయం నుంచి ఎదుర్కొన్న గోదావరి జలాలతో మానేరు జలశోభితం సంతరించుకున్నది. రూ.కోట్లతో పలు అభివృద్ధి పనులను పర్యటకులకు ఆకట్టుకునేలా టూరిజం శాఖ చేపట్టింది. అందులో భాగంగా బోటులో షికారు చేసేలా ఏర్పాటు చేశారు అధికారులు. నేడు (శుక్రవారం) రామప్ప గుట్టల వద్ద ఈ బోటును మంత్రులు ప్రారంభించనున్నారు.

బహిరంగ సభ

స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. అనంతరం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో కేటీఆర్‌తో సహా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌తో పాల్గొంటారు. పాపన్న పేరిట అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ జంక్షన్‌కు సుమారు రూ.కోటిన్నర ఖర్చు చేయనున్నారు. జిల్లాలో మొదటి బైపాస్ రోడ్‌లో నర్సింగ్ కాలేజీ ఎదురుగా వేములవాడ, సిద్దిపేట ప్రధాన రహదారిపై సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేశారు. దీనికోసం మున్సిపల్ శాఖ రూ. 30 లక్షల నిధులు వెచ్చించింది. విగ్రహం చుట్టూ గార్డెన్, ఫౌంటేషన్‌తో సందర్శకులను ఆకట్టుకునేలా భారీ ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ నాయకులు.

మెరుగైన సేవలు

రాష్ట్రంలోని ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్న నేపథ్యంలో రోజురోజుకు రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. వారి సంఖ్యను బట్టి ఆస్పత్రిలో మరో 130 పడకలను అందుబాటులోకి తెచ్చారు అధికారులు. దాదాపు దీనికి రూ. రెండు కోట్లతో అదనపు పడగల గదులు, 40 కేవీ రూట్ మ్యాప్, సోలార్ క్యాన్సర్ బాధితుల కోసం కీమోథెరఫీ డీకేర్‌ సెంటర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఏరియా ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయిలో ఆధునికరించి మెరుగైన వైద్యం అందించేలా కేసీఆర్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నారు. ఇప్పటికే కార్మిక క్షేత్ర ప్రజలకు సిటీ స్కానింగ్‌తో పాటు, ఐసీయూ, డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి కిడ్నీ బాధితులకు ఉచిత డయాలసిస్ సేవలందిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు