Hyderabad: భాగ్యనగరం సిగలో మరో 5 ఫ్లైవర్స్.. నేడే శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్..

విశ్వనగరంగా గుర్తింపు పొందుతున్న హైదరాబాద్‌లో అంతేస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రజా రవాణాలో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో మరో 5 వంతెనలు నిర్మాణానికి పునాది రాయి పడనుంది. ఇవాళ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

Hyderabad: భాగ్యనగరం సిగలో మరో 5 ఫ్లైవర్స్.. నేడే శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్..
New Update

New Flyovers in Hyderabad: విశ్వనగరంగా గుర్తింపు పొందుతున్న హైదరాబాద్‌(Hyderabad)లో అంతేస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రజా రవాణాలో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో మరో 5 వంతెనలు నిర్మాణానికి పునాది రాయి పడనుంది. ఇవాళ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) ఈ వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ వెంతెనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రజలకు రావాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా అవసరైమన చర్యలన్నీ చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో సుమారు 55 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్యను తగ్గించేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగానే.. ఈస, మూసీ నదులపై నార్సింగి నుంచి గౌరెల్లి వరకు 5 కొత్త వంతెనలను నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం.. హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ హెచ్ఎండీఏ రూ. 168 కోట్లు నిధులను విడుదల చేసింది. ఈ 5 వంతెనలను 4 లేన్లతో 15 నెలల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 5 వెంతెనల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ సోమవారం నాడు శంకుస్థాపన చేయనున్నారు.

హైదరాబాద్‌లో నిర్మించనున్న కొత్త ఫ్లై ఓవర్స్ ఇవే..

ప్లాన్‌లో భాగంగా ఈసీ నదిపై బుద్వేల్ ఐటీ పార్క్ - 1, 2 దగ్గర రెండు వంతెనలు, మూసీ నదిపై మంచిరేవుల దగ్గర ఓ వంతెన, ఉప్పల్ భగాయత్ హెచ్‌ఎండీఏ లే అవుట్ దగ్గర మూసీ నదిపై నాలుగో వంతెన, ప్రతాప సింగారం దగ్గర 5వ వంతెననను నిర్మించనుంది రాష్ట్ర ప్రభుత్వం.

ఈ ప్లాన్‌లో భాగంగా ఈసీ నదిపై బుద్వేల్‌ ఐటీ పార్క్‌-1, 2 దగ్గర రెండు వంతెనలు, మూసీ నదిపై మంచిరేవుల దగ్గర ఓ వంతెన, ఉప్పల్ భగాయత్‌ HMDA లే అవుట్‌ దగ్గర మూసీ నదిపై నాలుగో వంతెన, ప్రతాప సింగారం దగ్గర ఐదో వంతెన నిర్మించనున్నారు. మూసీ, ఈసీ నదులపై మొత్తం 14 వంతెనలు నిర్మించాలని నిర్ణయించగా.. 5 బ్రిడ్జిలను HMDA నిర్మిస్తుంది. మిగతా 9 వంతెనల నిర్మాణ బాధ్యత GHMC తీసుకోనుంది. HMDA నిర్మిస్తున్న 5 వంతెనలకు ఇటీవలే టెండర్లను ఆహ్వానించారు అధికారులు. కాగా, నగరంలో కొత్తగా నిర్మించే బ్రిడ్జిలు ఆకర్షణీయంగా ఉండేలా పలు డిజైన్‌లను ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది.

కేటీఆర్ షెడ్యూల్ ఇదే..

  1. ఇవాళ మూసీ నదిపై మూడు చోట్ల వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్.
  2. మధ్యాహ్నం 1 గంటకు ఫతుల్లా గూడ వద్ద మూసీ పై బ్రిడ్జి కి శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్.
  3. మధ్యాహ్నం 2 గంటలకు ఉప్పల్ భగాయత్ వద్ద బ్రిడ్జి కి శంకుస్థాపన.
  4. మధ్యాహ్నం 3 గంటలకు ముసారాం బాగ్ కొత్త బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన.
  5. సాయంత్రం 5.30 కి దుర్గం చెరువు STP మురుగు నీటి శుద్దీకరణ ప్లాంట్ ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్.
  6. సాయంత్రం 6.30 దుర్గం చెరువులో ముజికల్ ఫౌంటెన్ ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్.

Also Read:

కడియం శ్రీహరికి జైకొట్టిన రాజయ్య.. కేటీఆర్ సమక్షంలో సయోధ్య.. వివరాలివే!

చరణ్ ‘గేమ్‌ఛేంజర్’ మూవీ షూటింగ్ అందుకే క్యాన్సిల్ చేశాం

#hyderabad #minister-ktr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe