ప్రగతి పూదోటలో అభివృద్ధి పనులకు శ్రీకారం

New Update

సిద్దిపేట‌లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పట్టణ శివారులోని నాగులబండ వద్ద రాజీవ్‌ రహదారిని ఆనుకొని నిర్మించిన ఐటీ టవ‌ర్‌ను మంత్రులు క‌లిసి ప్రారంభించారు. సిద్దిపేట అభివృద్ధిలో ఆదర్శ నగరంగా ఖ్యాతి గడించింది. కొత్త కట్టడాలతో అందరిని ఆకర్షిస్తోంది. దినదినాభివృద్ధి సాధిస్తున్న నగరంగా ప్రత్యేకతను చాటుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు.

Minister KTR Super Speech at Nagulabanda Bahiranga Sabha

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సారథ్యంలో పట్టణ ప్రగతిలో తనదైన ముద్ర వేసిన ఈ ప్రాంతం.. అధ్యయన కేంద్రంగా.. దర్శనీయ ప్రాంతంగా రూపుదిద్దుకుంటోంది. అన్నింటా ముందుండే ప్రథమ శ్రేణి బల్దియా.. నేడు విశేష.. విశిష్టమైన కార్యక్రమాలకు నెలవుగా మారనుంది. మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావుతో కలిసి ప్రధానంగా 6 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో మంత్రి హోదాలో కేటీఆర్‌ తొలి అధికారిక పర్యటన కావడం విశేషంగా మారిది.

కొలువుల సౌధం: యువత ఎప్పటి నుంచో ఆశగా ఎదురుచూస్తున్న ఐటీ టవర్‌ ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చింది. 2020 సంవత్సరం డిసెంబరులో సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. రూ.63 కోట్లతో సిద్దిపేట శివారు నాగులబండ సౌధాన్ని నిర్మించారు. ఈ నెల 13న ఉద్యోగ మేళా నిర్వహించగా వేల సంఖ్యలో యువత తరలివచ్చిన విషయం తెలిసిందే. 15 కంపెనీలు భాగస్వామ్యం కావటం విశేషం.

స్లాటర్‌ హౌజ్‌తో బోణీ: సిద్దిపేట గ్రామీణ మండలం ఇర్కోడులో స్లాటర్‌ హౌజ్‌ ప్రారంభమైంది. రూ.6 కోట్లతో నిర్మించిన ఆధునిక నమూనా నిర్మాణం. నాణ్యమైన మేక-గొర్రె మాంసం అందించడమే లక్ష్యంగా చేపట్టారు. మాంసం వ్యర్థాలతో గ్యాస్‌ తద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తారని తెలిపారు.

అమృత్‌: జల వలయానికి అనుసంధానంగా అమృత్‌-2.0లో భాగంగా రూ.87.50 కోట్లతో 5 నీటి ట్యాంకులు, కొత్తగా 90 కిలో మీటర్ల తాగునీటి పైపులైన్ల నిర్మాణం, ఇతరత్రా పనులకు శంకుస్థాపన చేశారు. 3-1500, ఒకటి చొప్పున 1200,1000 కేఎల్‌ సామర్థ్యంలో ట్యాంకులు నిర్మాణం చేశారు. సిద్దిపేటలోని గద్దబొమ్మ వద్ద పనులకు శంకుస్థాపన మంత్రుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు

కప్పలకుంటకు వైభవం: సుడా నిధులు రూ.3.33 కోట్లతో సిద్దిపేటలోని కప్పలకుంట ఆధునికీకరణకు అంకురార్పణ జరగనుంది. ఈ కట్టను 3 నుంచి 6 మీటర్లకు విస్తరించనున్నారు. ఎకరం విస్తీర్ణంలో ఉద్యానం అభివృద్ధి చేయనున్నారు. బహిరంగ వ్యాయామ శాల, చిన్నారుల ఆట స్థలం, ఆకర్షణీయ బొమ్మలు తీర్చిదిద్దనున్నారు.

ఐటీ సౌధం లోపల: పట్టణంలో వివిధ దశల్లో రూ.89 కోట్లతో సీసీ, బీటీ దారుల నిర్మాణం చేపట్టారు. కొత్తగా రూ.20 కోట్లతో బీటీ, సీసీ దారులు నిర్మించనున్నారు. తద్వారా పట్టణంలో సుమారు 90 శాతం మేర రోడ్లు బాగుపడనున్నాయి. ఈ పనులకు కోటిలింగేశ్వరాలయం వద్ద శంకుస్థాపన జరగింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు