ఓఆర్‌ఆర్‌పై ఇంటర్ చేంజ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌లో ఓఆర్‌ఆర్‌పై ఇంటర్ చేంజ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్‌ రింగు రోడ్డుపై కొత్తగా మరో ఇంటర్‌ చేంజ్‌ అందుబాటులోకి రానున్నది. నార్సింగి వద్ద రూ.29.50 కోట్లతో నిర్మించిన ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌ చేంజ్‌ను ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

New Update
ఓఆర్‌ఆర్‌పై ఇంటర్ చేంజ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

Minister KTR started interchange on ORR

భాగ్యనగరానికి మణిహారంలా మారిన ఓఆర్‌ఆర్‌పై కొత్తగా మరో ఇంటర్‌ చేంజ్‌ అందుబాటులోకి వచ్చింది. నార్సింగి వద్ద రూ.29.50 కోట్లతో నిర్మించిన ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌ చేంజ్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. గ్రేటర్‌ చుట్టూ 158 కి.మీ మేర ఉన్న ఓఆర్‌ఆర్‌పై ఇప్పటి వరకు 19 ఇంటర్‌ చేంజ్‌లు ఉన్నాయి. నార్సింగి, కోకాపేట నియోపొలీస్‌, మల్లంపేట ప్రాంతాల్లో కొత్తగా మరో మూడింటిని హెచ్‌ఎండీఏ నిర్మాణం చేపట్టింది. ఇందులో నార్సింగి ఇంటర్‌ చేంజ్‌ పనులు పూర్తికావడంతో ట్రాఫిక్‌ను అనుమతించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ నేడు దానిని ప్రారంభిస్తారు.

గ్రేటర్‌ చుట్టూ ఓఆర్ఆర్

గ్రేటర్‌ చుట్టూ నిర్మిం చిన ఔటర్‌ రింగు రోడ్డు వరకు కోర్‌ సిటీ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే మార్గాలను రేడియల్‌ రోడ్లుగా గుర్తించి ఎంతో విశాలంగా, సిగ్నల్‌ అవసరమే లేకుండా ఇంటర్‌ చేంజ్‌లను నిర్మించారు. ఇలా మొత్తం ఓఆర్‌ఆర్‌ మీద 19 చోట్ల నిర్మించగా, నార్సింగి వద్ద మాత్రం కేవలం ఓఆర్‌ఆర్‌ దారి కింద నుంచి వెళ్లగా శంకర్‌పల్లి వైపు వెళ్లే దారి వద్ద ఫ్లైఓవర్‌ నిర్మించారు . ఇంటర్‌ చేంజ్‌ను నిర్మించాల్సిన చోట కేవలం ఫ్లైఓవర్‌ నిర్మించడంతో.. ఇప్పుడు ఇక్కడ నెల కొన్న సమస్య కోసం కొత్తగా ఇంటర్‌ చేంజ్‌ నిర్మాణానికి చేపట్టినా ఎన్నో ఇబ్బం దులు తలెత్తాయి. గండిపేట నుంచి వచ్చే మూసీ నదికి తోడు మెహిదీపట్నం నుంచి శంకర్‌పల్లి వెళ్లే దారిలో భూసేకరణ చేయలేదు. దీంతో కొంత కాలంగా నార్సింగి ఇంటర్‌ చేంజ్‌ పనులకు సాంకేతి కంగా అడ్డంకులు ఎదురైనా, వాటిని పరిష్కరించి నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఇందు కోసం మొత్తం రూ.29.50 కోట్లతో నార్సింగి ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌ చేంజ్‌ పనులను పూర్తి చేశామని HMDA అధికారులు తెలి పారు.

పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు

ఐటీ కంపెనీలు పెద్దఎత్తున నగరంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్‌ ప్రాంతం శరవేగంగా విస్తరిస్తున్నది. ఐటీ కారిడార్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయంతోపాటు బెంగళూరు, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, విజయవాడ వంటి హైవేలవైపు వెళ్లేందుకు ఓఆర్ఆర్ అందుబాటులో ఉంది. ఓఆర్‌ఆర్‌పై ఉండే ట్రాఫిక్‌ మొత్తంలో సింహ భాగం ఐటీ కారిడార్‌ నుంచే ఉంటున్నది. ప్రధానంగా జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌తోపాటు మియాపూర్‌, కూకట్‌పల్లి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతోపాటు కోకాపేట, మణికొండ, నార్సింగి, నానక్‌రాంగూడ, పుప్పాల్‌గూడ ప్రాంతాల నుంచి ఔటర్‌పై రాకపోలు సాగించే వారిసంఖ్య గణనీయంగా పెరిగింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు