కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం (Karnataka Congress Government) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీ తెలంగాణ నేతల్లోనూ ఉత్సాహం పెరిగింది. ఇదే ఊపులో ఇక్కడ కూడా అధికారంలోకి వస్తామంటూ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఇచ్చిన హామీలను ఇక్కడ కూడా ఇచ్చేశారు హస్తం నేతలు. తమ ఉపన్యాసాల్లోనూ కర్ణాటక మోడల్ అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే.. కర్ణాటకలో సిద్దరామయ్య సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులు పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. మీరు గెలిస్తే కరెంట్ కోసం కర్ణాటకలో మాదిరిగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి తెస్తారంటూ ఫైర్ అవుతున్నారు.
ఇది కూడా చదవండి: Harish Rao: ‘ఆఫీసుల చుట్టూ తిరిగి లంచాలు ఇస్తే పని అయ్యేది’.. తెలంగాణ పాల పిట్ట కేసీఆర్!
సోషల్ మీడియాలోనూ ఇందుకు సంబంధించిన విమర్శలు, ప్రతి విమర్శలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా మంత్రి కేటీఆర్ (Minister KTR) కర్ణాటకలోని రోణిహాల్ గ్రామంలో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కరెంట్ ఇవ్వడం లేదని అక్కడి రైతులు సబ్ స్టేషన్ లో మొసలిని వదలడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీనిని షేర్ చేసిన చేసిన కేటీఆర్ ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో అంటూ తన దైన శైలిలో కాంగ్రెస్ పార్టీపై సెటైర్ వేశారు. గద్వాలలో కర్ణాటక రైతుల నిరసనకు సంబంధించిన మరో వీడియోను కూడా కేటీఆర్ షేర్ చేశారు. అయితే.. ఈ వీడియోకు కాంగ్రెస్ పార్టీ ఎలా కౌంటర్ ఇస్తుందనే అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.