సాయిచంద్‌ భౌతికకాయానికి మంత్రి కేటీఆర్‌ నివాళులు

ప్రముఖ గాయకుడు సాయిచంద్‌ భౌతికకాయానికి మంత్రి కేటీఆర్‌ నివాళులార్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్‌ నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్‌.. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు.

New Update
సాయిచంద్‌ భౌతికకాయానికి మంత్రి కేటీఆర్‌ నివాళులు

Minister KTR pays tribute to Saichand body

ప్రముఖ గాయకుడు సాయిచంద్‌ భౌతికకాయానికి మంత్రి కేటీఆర్‌ నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్‌ నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్‌.. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కేటీఆర్‌ వెంట మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రసమయి బాలకిషన్‌, టీఎస్‌ఎమ్మెస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఉన్నారు.

పాటల ద్వారా అందరిని ఏకం చేశారు

అనంతరం మాట్లాడుతూ.. సాయిచంద్‌ అద్భుతమైన కళాకారుడని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారని వెల్లడించారు. సాయిచంద్‌ మరణం తీరని లోటని తెలిపారు. ఉద్యమంలో పాటల ద్వారా అందరిని ఏకం చేశారన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా పాటలు పాడారని చెప్పారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడించారు.

ప్రభుత్వం అండగా ఉంటాము

మరికాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గుర్రంగూడలోని సాయిచంద్‌ నివాసానికి వెళ్లనున్నారు. సాయిచంద్‌ భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు. కాగా, గురువారం మధ్యాహ్నం వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్‌ స్మశానవాటికలో సాయిచంద్‌ అంత్యక్రియలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ చూస్తున్నారు. మధ్యాహ్నం సాయిచంద్‌ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానున్నది.

Advertisment
Advertisment
తాజా కథనాలు