100 Lies of BJP CD: ఎన్డీయే సర్కార్ వైఫల్యాలను, తెలంగాణకు చేసిన అన్యాయాలను వివరిస్తూ.. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) సోషల్ మీడియా సెల్ రూపొందించిన ‘బీజేపీ వంద అబద్దాలు’ బుక్ లెట్, సీడీని మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రగతిభవన్ లో ఆవిష్కరించారు. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోడీ సర్కార్ (Modi Govt) ఎలా మోసం చేసింది.. తెలంగాణ ప్రజలకు హక్కుగా రావాల్సిన వాటిని ఎలా అడ్డుకుంటున్నారనే విషయాలను ఇందులో వివరించడం జరిగింది.
భారంగా మారిన జీఎస్టీ, దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణం, అందరికీ ఇల్లు, విభజన హామీల అమలు, ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ సదుపాయం, బయ్యారం స్టీల్ ప్లాంట్, ఐటీఆర్, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, ఎస్టీ రిజర్వేషన్లతో పాటు బీజేపీ నాయకుల అసలు రూపాన్ని వీటి ద్వారా బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ బయటపెట్టే ప్రయత్నం చేసింది.
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు మన్నె క్రిషాంక్, వై.సతీష్ రెడ్డి, జగన్ మోహన్ రావు, దినేష్ చౌదరి చేపట్టిన ‘బీజేపీ వంద అబద్దాలు’ క్యాంపెయిన్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. అబద్దాల పునాదుల మీద రాజకీయం చేస్తున్న బీజేపీ అసలు రూపాన్ని ప్రజల ముందు ఉంచామన్నారు.
Also Read: ఆకలి కేకలు.. ఆత్మహత్యలే ఎటు చూసినా..స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో కేసీఆర్ సంచలన కామెంట్స్!