KTR With My Village Show Team: మరి కొద్ది రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections) జరగనున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ నాయకులంతా ఎన్నికల ప్రచారం లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్దించడం మొదలుపెట్టారు కూడా.
ఈ క్రమంలోనే మరికొంతమంది నాయకులు అయితే సోషల్ మీడియా(Social media) ద్వారా ఓటర్లకు చేరువ అయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే యువ నాయకుడు, ఐటీ మంత్రి కేటీఆర్ (KTR) , ప్రముఖ యూట్యూబర్లు '' మై విలేజ్ షో'' (My village show) బృందంతో కలిసి వంట చేశారు.
దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మై విలేజ్ షో యూ ట్యూబ్ కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పల్లెటూరి రుచులను, అనుబంధాల మీద వీడియోలు చేసి ఎంటర్‌టైన్ చేస్తుంటారు. చిన్న చిన్న వీడియోలతో ఈ ఛానెల్ ప్రారంభం అయ్యింది.
తాజాగా ఈ ఛానెల్ సినిమా హీరోలతో ప్రమోషన్ వీడియోలు చేసే రేంజ్ కు ఎదిగింది. ఇందులో గంగవ్వ (Gangavva) బాగా ఫేమస్ కాగా, అనిల్ (Anil Geela), అంజిమామ కూడా పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ షో ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది గంగవ్వ. ఏకంగా బిగ్ బాస్ షోకి కూడా వెళ్లింది. గంగవ్వ ఇప్పటికే చాలా మంది ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేసింది.
వారిలో సమంత కూడా ఉంది. తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ టీంతో మంత్రి కేటీఆర్ సందడి చేశారు. టీంతో కలిసి కేటీఆర్ నాటుకోడి కూర, బగారా రైస్ వండి సరదగా గడిపారు. ఈ కార్యక్రమంలోనే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి కూడా ప్రస్తావించారు. అలా ఆయన వండుతూ...పూర్తి అయిన తరువాత వారితో కలిసి తిన్నారు కూడా.
ఈ వీడియోలో మై విలేజ్ షో టీం అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు కూడా ఇచ్చారు. రాజకీయ పరంగానే కాకుండా కుటుంబం గురించి కూడా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన తన చిన్ననాటి జ్ఙాపకాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తనది పెద్దలు కుదిర్చిన వివాహం అని..తనకు ఇద్దరు బావమరుదులు ఉన్నారని వివరించారు.
వారిద్దరూ నన్ను బాగా చూసుకుంటారని ఆయన తెలిపారు. తనకు ఈత రాదని కేటీఆర్ చెప్పారు. ఎమ్మెల్సీ కవిత తనకంటే మూడేళ్లు చిన్నదని పేర్కొన్నారు. రాఖీ పండుగ రోజు కవితకు చీర పెట్టినట్లు చెప్పారు. గంగవ్వ కుటుంబం గురించి ఆయన ఆరా తీశారు. ఎంత భూమి ఉందని అడిగారు. రైతు బంధు పడుతుందా లేదా అని ఆరా తీశారు.
తనకు రైతు బంధు (RYTHU BANDHU/BIMA) వస్తుందని గంగవ్వ చెప్పారు. సిరిసిల్లలో (Siricilla) తాను పోటీ చేస్తున్నప్పటి నుంచి ఒక్క చుక్క మందు పోయలేదని , ఒక్క నోటు కూడా పంచి పెట్టలేదని అన్నారు. కానీ ప్రజలు తనను ఎప్పటికప్పుడే ఆదరిస్తున్నారని తెలిపారు. మంచి చేస్తామని వారికి నమ్మకం ఉంటేనే ప్రజలు నమ్మి తమను గెలిపిస్తారని అన్నారు.
కేసీఆర్ (KCR) ప్రభుత్వం మరో సారి వస్తే ప్రజలకు మరింత మంచి జరుగుతుందని అన్నారు. కేటీఆర్ వెరైటీగా ఇలా ప్రచారం చేయడంతో ఆయన్ని చాలా మంది అభినందిస్తున్నారు. సాంకేతికతను , సోషల్ మీడియా, ట్రెండింగ్ లో ఉన్న విషయాలను ఉపయోగించుకోవడంలో మంత్రి కేటీఆర్ ని మించినోడు లేడని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Also read: విమానాశ్రయంలో కాల్పులు..నిలిచిన సర్వీసులు!