Minister KTR: ప్రింట్ మీడియా రిపోర్టర్లతో మంత్రి కేటీఆర్ చిట్‌చాట్

ప్రగతిభవన్‌లో ప్రింట్ మీడియా రిపోర్టర్లతో మంత్రి కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్‌ పార్టీకి మరింత సానుకూల వాతావరణం ఉన్నదన్నారు. 90 స్థానాలకుపైగా గెలుస్తాం, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని కేటీఆర్‌ దీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ సమాచారం ప్రకారం కేసీఆర్‌రే ఈ రాష్ట్రానికి ఉండాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు భావిస్తున్నారని కేటీఆర్‌ అన్నారు.

Telangana Elections: ప్లీజ్ అలా ప్రచారం చేయకండి.. ఆ ప్రకటనపై క్లారిటీ ఇచ్చిన మంత్రి కేటీఆర్..
New Update

మూడోసారి సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేస్తారు

ప్రగతిభవన్‌లో ప్రింట్ మీడియా రిపోర్టర్లతో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) చిట్ చాట్ నిర్వహించారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్‌ పార్టీ (BRS Party)కి మరింత సానుకూల వాతావరణం ఉన్నదన్నారు. 90 స్థానాలకుపైగా గెలుస్తాం, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని కేటీఆర్‌ దీమ వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ సమాచారం ప్రకారం కేసీఆర్‌ (CM KCR)రే ఈ రాష్ట్రానికి ఉండాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు భావిస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. పది సంవత్సరాలల్లో ప్రభుత్వం అందించిన పథకాలు, సంక్షేమ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలే అద్భుతంగా వివరిస్తున్నారని అన్నారు. ప్రజలకు చాలా స్పష్టత ఉంది, ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయని ఆయన అన్నారు.

ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు

కేసీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. ప్రతిపక్షల తాపత్రయం రెండవ స్థానం కోసమే అని ఎద్దేవా చేశారు. సిట్టింగ్లకు సీట్లు ఇవ్వకుంటే మా దగ్గరికి వస్తారని ప్రతిపక్షాలు భావించాయి. తాను నిర్మించిన నాయకత్వం, పార్టీ నాయకులపైన తనకున్న నమ్మకం మేరకే కేసీఆర్ సిట్టింగ్ స్థానాలకు సీట్లు ఇచ్చారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని కేటీఆర్ అన్నారు. 65 సంవత్సరాలలో మెడికల్ కాలేజీలు, కేవలం రెండు మెడికల్ కాలేజీలే ప్రతిపక్షాలు పెట్టాయన్నారు. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు, నర్సింగ్ కాలేజీ ఇవ్వలేదు, నవోదయ పాఠశాల ఇవ్వలేదని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అస్థిరత, నాయకత్వ లోపం తెలంగాణలో లేదన్నారు. మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్, ప్రతిపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో వారికే తెలియదన్నారు. ఢిల్లీ నుంచి వచ్చి సీల్డ్ కవర్లు, వారికి అందించే మూటలు మాత్రమే ప్రతిపక్షాల పరిస్థితి అని కేటీఆర్‌ విమర్శించారు.ముఖ్యమంత్రులను మార్చడానికి మత కల్లోలాలను లేపి మరణహోమం సృష్టించి, మనుషులను చంపిన పార్టీ కాంగ్రెస్ అని ఫైర్‌ అయ్యారు.

చెప్పులు విసిరే పార్టీ కాంగ్రెస్

తమ పార్టీ నాయకులపైననే చెప్పులు విసిరే పార్టీ కాంగ్రెస్ (Congress Party) అన్నారు. తెలుగువారి గౌరవం పీవీ నరసింహారావు పైననే చెప్పులు విసిరిన ఘనత కాంగ్రెస్‌ది అని మండిపడ్డారు. ఢిల్లీ బానిస పార్టీలు జాతీయ పార్టీలు ఆత్మగౌరవం అధికంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఈ బానిసత్వ పార్టీలను అంగీకరించరన్నారు. తెలంగాణ ప్రజలకు ఢిల్లీ బానిసలు కావాలా..? తెలంగాణ బిడ్డ కావాలా..? తెలుసుకోవాలన్నారు. కేవీపీ రామచంద్రరావు, షర్మిలలు, తెలంగాణ వాదులమని చెప్పుకుంటున్నారు. తెలంగాణ ఈరోజు వారు కాంగ్రెస్‌ని గెలిపిస్తారంట..!!. తెలంగాణను వ్యతిరేకించిన కేవీపీ, షర్మిలలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి తేస్తాం అంటున్నారు. ఇంతటి దుస్థితి కాంగ్రెస్ పార్టీకి పట్టిందన్నారు. తెలంగాణ ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టలేని కిషన్‌రెడ్డి, తెలంగాణ ప్రజలపైన రైఫిల్ తీసుకువెళ్లిన రేవంత్‌రెడ్డి.. వీరు తెలంగాణ కోసం ముసుగులో వచ్చారని అన్నారు.

తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

తెలంగాణ వ్యతిరేకతను నరనరాన నింపుకొన్న కిరణ్‌కుమార్‌రెడ్డి...కేవీపీ రామచందర్రావు... షర్మిల వంటి తెలంగాణ వ్యతిరేకులంతా ఏకమవుతున్నారు. బహురూపుల వేషాల్లోలో తెలంగాణపైకి వస్తున్నారని మండిపడ్డారు. వీరందరితో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. పదేళ్లు సాధించిన అభివృద్ధిని, తెలంగాణ వ్యతిరేకుల చేతులు పెడదామా..? ప్రజలు తెలుసుకోవాలన్నారు. పైకి కనబడేది కిషన్‌రెడ్డి అదించేది కిరణ్‌కుమార్ రెడ్డి, కనబడేది రేవంత్‌రెడ్డి ఆడించేది కేవీపీ రామచంద్రరావు అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం కేవీపీ రామచంద్రరావు చేశారు. ఈరోజు తెలంగాణ వాదిగా చెప్పుకోవడం మా కర్మ అని అన్నారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ వాది కాదు తెలంగాణకు పట్టిన వ్యాధి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒకరైన తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా..? ఒక్కరన్న రాజీనామా చేశారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లుతాయి అని తెలంగాణ ప్రజలు బెదిరించి, మెడలు వంచితే తెలంగాణ ఇచ్చింది సోనియా అంటే అన్యాయంగా ఉంటుందని కేటీఆర్ అన్నారు.

Also Read: ప్లీజ్ అలా ప్రచారం చేయకండి.. ఆ ప్రకటనపై క్లారిటీ ఇచ్చిన మంత్రి కేటీఆర్..

#minister-ktr #chit-chat #print-media-reporters #pragati-bhavan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe