Konda Surekha: కోతుల వల్లే షార్ట్ సర్క్యూట్.. ఎంజీఎంలో రివ్యూ తర్వాత కొండాసురేఖ కామెంట్స్!

వరంగల్‌ ఎంజీఎం ప్రక్షాళనపై దృష్టి సారించామన్నారు మంత్రి కొండాసురేఖ. ఆస్పత్రిలో శుక్రవారం అర్థరాత్రి రెండు గంటలకు పైగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోగా.. కోతుల బెడద వల్ల వైర్లు తెగి షార్ట్ సర్క్యూట్ జరిగిందని క్లారిటీ ఇచ్చారు.

New Update
Konda Surekha: కోతుల వల్లే షార్ట్ సర్క్యూట్.. ఎంజీఎంలో రివ్యూ తర్వాత కొండాసురేఖ కామెంట్స్!

వరంగల్‌(Warangal) ఎంజీఎం(MGM) ఆస్పత్రిలో శుక్రవారం అర్థరాత్రి రెండు గంటలకు పైగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన విషయం తెలిసిందే. కొందరు రోగులు, వారి కేర్‌టేకర్లు భయాందోళనకు గురయ్యారు. దీనిపై మంత్రి కొండాసురేఖ తాజాగా స్పందించారు. ఎంజీఎంలో రివ్యూ తర్వాత మంత్రి కొండా సురేఖ(Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు. కోతుల బెడద వల్ల వైర్లు తెగి షార్ట్ సర్క్యూట్ జరిగి ఎంజీఎంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు సురేఖ. వెంటనే అధికారులు అప్రమత్తమై విద్యుత్ ను పునరుద్దరించారన్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు.

కొండా సురేఖ కామెంట్స్:

➼ హెల్త్ సిటీ పేరుతో నిర్మిస్తున్న ఆస్పత్రి గురించి ఎంజీఎం అధికారులకు సమాచారం లేదు.

➼ ఎంజీఎం గుండెకాయలాంటిది.. దీనిని కాపాడుకోవాలి.

➼ ఎంజీఎం ప్రక్షాళనపై దృష్టి సారించాం.

➼ గతంలో జరిగిన ఘటనలు ఇక పునరావృతం కావు.

➼ ఎంజీఎంలో ప్రస్తుతం 25మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.

➼ వారిలో సీరియస్ లక్షణాలు ఏవీ లేవు అయినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యం అందిస్తున్నాం : కొండా సురేఖ

బ్యాకప్ బ్యాటరీలు ఉండాలి:
MGM ఉత్తర తెలంగాణ ప్రాంత అవసరాలను తీర్చే ఏకైక పెద్ద ఆసుపత్రి. ఆసుపత్రిలో జనరేటర్లు అమర్చారు. కానీ అవి పనిచేసే పరిస్థితి లేదు. ఫలితంగా, రోగులు ముఖ్యంగా ఎమర్జెన్సీ వార్డు, అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్ (AMCU), స్పెషల్ న్యూ-బోర్న్ కేర్ యూనిట్
(SNCU), రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (RICU), ఆపరేషన్ థియేటర్లలో తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు. ఎమర్జెన్సీ వార్డు, ఆపరేషన్‌ థియేటర్‌ వైద్యులు కూడా అత్యవసర చికిత్సలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ప్రాంతంలో కోతులు ఒక విద్యుత్ స్తంభం నుంచి మరొక స్తంభానికి దూకుతున్నాయి. దీనికారణంగానే రెండు విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగలడంతో నిప్పురవ్వలు, షార్ట్ సర్క్యూట్, ట్రాన్స్‌ఫార్మర్‌ పేలింది. రెండు గంటల తర్వాత ఎన్‌పీడీసీఎల్‌ సిబ్బంది విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. ఆక్సిజన్ వెంటిలేటర్లు, ఇంక్యుబేటర్లు లాంటి పరికరాలకు, ముఖ్యంగా SNCUతో పాటు అత్యవసర వార్డులలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం బ్యాకప్ బ్యాటరీలు ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read: రైతులు, విద్యార్థులకు రేవంత్‌ గుడ్‌న్యూస్‌.. న్యూఇయర్‌ మెసేజ్‌లో ఏం అన్నారంటే?

WATCH:

Advertisment
తాజా కథనాలు