Minister Komatireddy: సంచలనానికి తెరలేపిన మంత్రి కోమటిరెడ్డి ట్వీట్..కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దామంటూ..!!

రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఉన్న ఫొటో ఉంచి కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం అంటూ క్యాప్షన్ తో పోస్టు చేశారు.

New Update
Minister Komatireddy: సంచలనానికి తెరలేపిన మంత్రి కోమటిరెడ్డి ట్వీట్..కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దామంటూ..!!

తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్ లో ఏ మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా...ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అది సంచలనంగా..చర్చనీయాంశంగా మారుతున్నది. తాజాగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  (Minister Komatireddy)తన ట్విట్టర్ ఎక్స్(Twitter X) లో చేసిన పోస్టులు ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో సంచలనానికి తెరలేపింది.

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)తో తాను కలిసి ఉన్న ఫొటోను బ్యాక్ గ్రౌండ్ లో ఉంచి కలిసికొత్త శకాన్ని నిర్మిద్దాం అనే క్యాప్షన్ తో పోస్టు చేశారు. గ్రాఫిక్ చేసిన ఈ ఫొటోలో బ్యాక్ గ్రౌండ్ లో ప్రభుత్వ లోగోతోపాటుగా సచివాలయం ఫొటో కూడా ఉంది. ఈ పోస్టును భట్టి విక్రమార్కకు ట్యాగ్ చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. దీంతో ఈ ఫోస్ట్ కొద్ది సమయంలో తెగ వైరల్ గా మారింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఈ పోస్టులోని కొత్త శకాన్నినిర్మిద్దాం అనే వ్యాఖ్యపై తీవ్ర స్ధాయిలో చర్చ సాగుతోంది.

అటు రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు 

విద్యాశాఖపై సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రైవేట్ యూనివర్సిటీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలుచేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్ఠారాజ్యంగా నడిపించుకోవడం సరికాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ(SC), ఎస్టీలకు(ST) రిజర్వేషన్లు(Reservations)  కల్పించాలనేది రాజ్యాంగం(Indian Constitution) ఇచ్చిన హక్కు అని, రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీలలోనూ రిజర్వేషన్లు అమలుచేయడానికి అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసూలు చేసిన ఫీజులు, ఫీజు రీయింబర్సుమెంటు(Fees Reimbursement), టీచింగ్ సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బంది వంటి వాటి అన్నింటిపైనా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మౌలికవసతులు, అర్హతలున్న సిబ్బంది లేకుండా ప్రమాణాలతో కూడిన విద్యను ప్రైవేటు యూనివర్సిటీలు ఎలా అందిస్తున్నాయో నివేదికను ఇవ్వాలన్నారు.

ఇండ్ల ప్లాట్లకు రిజిష్ట్రేషను అయిన భూములను, ధరణిలో చూపించిన ప్రైవేటు యూనివర్సిటీకి అనుమతిని ఇచ్చారని, అలాంటివాటిలో ఎలాంటి విద్యను అందిస్తున్నాయనే నివేదికను ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇండ్ల స్థలాల కింద రిజిష్టరు అయిన, వివాదంలో ఉన్న భూముల్లో యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వడం వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటిపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. యూనివర్సిటీకి అనుమతులు రాకుండానే అడ్మిషన్లు నిర్వహించిన ఒక కాలేజీ వ్యవహారం వల్ల గత విద్యాసంవత్సరంలో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: త్వరలోనే మెగా డీఎస్సీ.. సీఎం రేవంత్ ఆదేశాలు

Advertisment
తాజా కథనాలు