Minister Komatireddy: బీఆర్‌ఎస్ భూస్థాపితమవుతుంది.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

TG: బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు మంత్రి కోమటిరెడ్డి. లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత బీఆర్‌ఎస్ భూస్థాపితమవుతుందని అన్నారు. రాష్ట్ర సంపదనంతా దోచుకున్నది చాలక కేసీఆర్‌ కుటుంబం ఢిల్లీకి వెళ్లిందని చురకలు అంటించారు.

New Update
Minister Komatireddy: బీఆర్‌ఎస్ భూస్థాపితమవుతుంది.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Minister Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు గుప్పించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి. లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత బీఆర్‌ఎస్ భూస్థాపితమవుతుందని అన్నారు. జూన్ 5 తరువాత బీఆర్ఎస్ నేతలను ఆ పార్టీ కార్యకర్తలే వెంటపడి కొడతారని అన్నారు. గత పదేళ్లు తెలంగాణకు సీఎం ఉండి రాష్ట్ర సంపదనంతా దోచుకున్నది చాలక కేసీఆర్‌ కుటుంబం ఢిల్లీకి వెళ్లిందని చురకలు అంటించారు. అవినీతి చేయకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై 8 వేల పేజీల ఛార్జిషీట్‌ దాఖలు చేశారా? అని ప్రశ్నించారు. కొత్త గా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అప్పుల ఖజానా మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు.

జిల్లాల్లో మున్సిపాలిటీల అనుమతులు లేకుండానే బీఆర్ఎస్ కార్యాలయాలని నిర్మించారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ హాస్పిటల్స్ భవనాలు 14 అంతస్తులు మించరాదని నిబంధనలను ఉన్నాయని చెప్పారు. ఎల్బీనగర్‌ హాస్పిటల్ స్థలానికి ఎన్‌వోసీ లేకుండా నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. అందెశ్రీ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాలని గత ప్రభుత్వాన్ని కోరామని... ఆడిటోరియానికి కాళోజీ పేరు పెట్టాలంటే పెట్టలేదని మండిపడ్డారు. నల్గొండ జిల్లాకు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం మంజూరు చేయిస్తే.. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపివేసింది అని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు