/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Revanth-Reddy-Komatireddy--jpg.webp)
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy).. తెలంగాణ రాజకీయాల్లో ఆయన స్టైలే వేరు. పీసీసీ చీఫ్ పదవి దక్కకపోవడంతో రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) తీవ్ర విమర్శలు చేయడంతో పాటు.. కొన్నాళ్ల పాటు హైకమాండ్ పైనే యుద్ధం ప్రకటించినంత పని చేశారు. రేవంత్ రెడ్డికి సైతం ఆయన చాన్నాళ్లూ సహకరించలేదు. సొంత జిల్లాలో పార్టీ మీటింగ్ ఉన్న సమయంలో బీజేపీ కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించడం లాంటి పనులు చేసి.. చాలా రోజుల పాటు కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు కోమటిరెడ్డి. ఆయనపై చర్చలు తీసుకునే సాహసం కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. కానీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ పరిస్థితి మారిపోయింది. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఆయన బహిరంగంగానే బలపరిచారు. ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డే సీఎం అన్న భావన వచ్చేలా బహిరంగంగానే మాట్లాడారు. ఎన్నికల తర్వాత కూడా ఆయన అదే విధానాన్ని కొనసాగించారు. రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా మారిపోయారు కోమటిరెడ్డి.
ఇది కూడా చదవండి: KCR: మేము ఓడింది అందుకే.. 30 యూట్యూబ్ ఛానల్స్ పెడితే.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!
అయితే.. అంతా సజావుగా సాగిపోతుందన్న తరుణంలో నిన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన సోషల్ మీడియాలో పోట్టిన పోస్టు రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. రేవంత్ రెడ్డి ఫొటో లేకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో (Bhatti Vikramarka) కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన కోమటిరెడ్డి కొత్త శకాన్ని నిర్మిద్దామంటూ పోస్టు చేశారు. దీంతో రేవంత్ రెడ్డితో గ్యాప్ కారణంగానే ఇలా ఆయన పోస్టు చేశారంటూ కామెంట్లు వినిపించాయి. కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలు స్టార్ట్ అయ్యాయని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగింది. దీంతో ఆ కామెంట్లకు కౌంటర్ ఇస్తూ ఈ రోజు రేవంత్ రెడ్డితో ఉన్న ఫోటోలతో సలార్ సాంగ్‌ను పోస్ట్ చేసి సంచలనం సృష్టించారు కోమటిరెడ్డి.
'వేగమొకడు… త్యాగమొకడు
గతము మరువని గమనమే.
ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే
ఒకరు గర్జన… ఒకరు ఉప్పెన
వెరసి ప్రళయాలే.
సైగ ఒకరు… సైన్యం ఒకరు
కలిసి కదిలితే కదనమే...'
వేగమొకడు… త్యాగమొకడు
గతము మరువని గమనమే.ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే
ఒకరు గర్జన… ఒకరు ఉప్పెన
వెరసి ప్రళయాలే.సైగ ఒకరు… సైన్యం ఒకరు
కలిసి కదిలితే కదనమే...#AdminPost #KomatiReddyVenkatReddy #RevanthReddy #TelanganaPrajaPrabhutwam @revanth_anumula @INCTelangana pic.twitter.com/BPNdM4LuRZ— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 31, 2023
అంంటూ పాట లిరిక్ ను కూడా షేర్ చేశారు కోమటిరెడ్డి. కోమటిరెడ్డి పోస్టులతో కాంగ్రెస్ నేతలు ఫుల హ్యాపీ అవుతున్నారు. మీరు ఇలాగే కలిసి ఉండాలన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నిన్న తన పోస్టుతో చెలరేగిన దుమారానికి మరో పోస్టుతో కౌంటర్ ఇచ్చారు కోమటిరెడ్డి.