Kolusu Parthasarathy: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన భూదాన్దాపై విచారణ సాగుతుంది దోషులు ఎంతటి వారైనా శిక్ష తప్పదని హెచ్చరించారు కొలుసు పార్థసారథి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిడ్కో గృహాలను త్వరలో ప్రజలకు పంపిణీ చేస్తామని కీలక ప్రకటన చేశారు. సమాచార శాఖలో అవినీతి జరిగిందని అన్నారు. ప్రభుత్వం గుర్తించి విచారణ చేపట్టిందని.. దోషులను కఠినంగా శిక్షిస్తాం అని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు
వైసీపీ నేత జగన్ ప్రజల్లో ఉన్న ప్రతిష్టను మరింత దిగజార్చుకునేందుకు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎలాంటి కక్ష రాజకీయాలు తాము చేయడంలేదని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలోని నాయకులు చేసిన తప్పిదాలే నేడు కేసుల రూపంలో వెంటాడుతున్నాయని అన్నారు.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అన్ని రంగాలలో పురభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రజలు కలలు కన్నా రాజధాని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా కృషి చేస్తుందని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం పై ప్రభుత్వం పెట్టుకున్న నమ్మకాన్ని సీఎం చంద్రబాబు అమలు చేస్తారని అన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సమగ్ర అభివృద్ధిని సాదిస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు.