Minister Jogi Ramesh: ఏపీ మంత్రి పీఏ మాయం.. చనిపోయినట్లు నమ్మించి.. ఏం చేశాడంటే..? మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ ఆదినారాయణ అదృశ్యం కేసులో పెద్ద ట్విస్ట్ దొరికింది. ఆదినారాయణ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్ రాసి చనిపోయిన విషయం తెలిసిందే. ఆదినారాయణ చనిపోలేదని, చనిపోతున్నట్లు అందరు నమ్మించి పరారయ్యాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. By Vijaya Nimma 28 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి ఏపీ మంత్రి జోగి రమేష్ వ్యక్తగత ఫోటోగ్రాఫర్ ఆదినారాయణ సూసైడ్ లెటర్ కలకలం రేపిన విషయం తెలసిందే. అవనిగడ్డ సమీపంలోని అంబటి బ్రాహ్మణయ్య వారధి వద్ద ఆదినారాయణ బైక్, వస్తువులను పోలీసులు గుర్తించారు. ముత్రాస్‌పాలెంకు చెందిన యరగాని ఆదినారాయణ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అయిన జోగి రమేష్ వద్ద వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌గా కొద్ది కాలంగా పనిచేస్తున్నాడు. అయితే ఫోటోగ్రాఫర్ ఆదినారాయణ అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్ దొరికింది. చనిపోతున్నట్లు అందరిని నమ్మించి ఆదినారాయణ పరారైయ్యాడు. సూసైడ్ నోట్‌లో సాధ్యమైనంతవరకు నా బాడీ దొరక్కుండా చనిపోతాను అంటూ ఆదినారాయణ రాశాడు. కాగా.. ఆదినారాయణ కోసం ఎన్‌డీఆర్ఎఫ్, పెడన, కోడూరులో రెండు రోజులు పోలీసులు తీవ్ర గాలింపు చేశారు. గాలింపు చర్యల్లో మృతదేహం కనబడకపోవడంతో సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో అదిరిపోయిన ట్విస్ట్ దొరికింది. చిన్నాపురం సిసి ఫుటేజ్‌లో ద్విచక్ర వాహనానికి బ్యాగ్ తగిలించుకుంటూ నవ్వుతూ ఫోన్ మాట్లాడుకుంటూ ఆదినారాయణ వచ్చాడు. ద్విచక్ర వాహనాన్ని ఉల్లిపాలెం బ్రిడ్జి దగ్గర పెట్టి చనిపోతున్నట్లు సూసైడ్ నోట్‌ను ఆదినారాయణ రాశాడు. Your browser does not support the video tag. ఆటో కోసం ఆగిన వీడియో ఆదినారాయణ బీటెక్ చదువుతున్న.. వారి భార్య నవ్య ఎంఎస్సీ కూడా చదివారు. సీసీ ఫుటేజ్‌లో పోలీసులకు అదిరిపోయిన ట్విస్ట్ దొరికింది. చిన్నాపురంలో ద్విచక్ర వాహనానికి బ్యాగ్ పట్టుకుని ఆదినారాయణ వచ్చాడు. ఆ వాహనాన్ని ఉల్లిపాలెం భవానిపురం వారధి వద్ద పెట్టి అక్కడి నుంచి ఆటో ఎక్కి కోడూరు గంగానమ్మ సెంటర్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్‌ని పోలీసులు పరిశీలించగా నైట్ టీ షర్ట్, షార్ట్ బ్యాగ్ తగిలించుకుని నడుచుకుంటున్న ఆటో కోసం ఆగిన వీడియో ఇప్పుడు కలకలం రేపింది. ఆదినారాయణ చనిపోలేదని, చనిపోతున్నట్లు అందరు నమ్మించి పరారయ్యాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. Your browser does not support the video tag. అప్పుల బారి నుంచి తప్పించుకోవడానికి... కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడితే 48 గంటల్లోపు బాడీ బయటకు వస్తుంది. కానీ ఇంకా రాకపోవడంతో పోలీసులు పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు పరిశీలించడంతో ఈ కోణం వెలుగులోకి వచ్చింది. ఆదినారాయణ బాగా చదువుకోవడంతో అప్పుల బారి నుంచి తప్పించుకోవడానికి విధంగా పక్క ప్లాన్ రచించాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆదినారాయణ కోసం స్థానిక మంత్రి సోదరుడు జోగి రాముతో పాటు వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఉల్లిపాలెం భవానీ వారధికి గత రెండు రోజుల నుంచి క్యూ కట్టారు. ఆదినారాయణ పొలం అమ్మగా తొమ్మిది లక్ష రూపాయలు వచ్చాయని, బంగారాన్ని కూడా తీసుకుని వెళ్లిపోయాడని కొంతమంది చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఏదేమైనా ఆదినారాయణ అదృశ కేసులో భారీ ట్విస్ట్ బయటికి వచ్చింది. #minister-jogi-ramesh #personal-photographer-adinarayana #disappearance-case #believed-to-be-dead మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి