బీజేపీ..కాంగ్రెస్ చేసింది లేదు: మంత్రి హరీష్‌రావు తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చింది లేదు.. కాంగ్రెస్ పార్టీ చేసింది లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. పటాన్‌చెరులో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్, ఫ్రీడం పార్కులను మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్- బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. By Vijaya Nimma 10 Jul 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ఏం చేశారో చెప్పండి.. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది లేదు.. కాంగ్రెస్ పార్టీ చేసింది లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. పటాన్‌చెరులో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్, ఫ్రీడం పార్కులను మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో హరీష్‌రావు పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్స్ వంటి పథకాలు ఉన్నాయా..? అని హరీష్‌రావు ప్రశ్నించారు. రిజెక్టెడ్ లీడర్లు, స్క్రాప్ లీడర్లు జాయిన్ అయితే పోయేది లేదు. బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కులు చేసినా, హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ మాత్రమేనని తేల్చిచెప్పారు. ప్రతిపక్షాలు అధ్యక్షులను మార్చినా, ఔట్ డేటెడ్ లీడర్లకు పట్టం కట్టినా తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం తథ్యమని మత్రి హరీష్‌రావు అన్నారు. బీజేపీ అంటేనే చిన్న చూపు కేంద్ర ప్రభుత్వం అడిగింది ఇప్పటివరకు ఇవ్వకుండా, అసలు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా మోసం చేసిందని హరీష్‌రావు ధ్వజమెత్తారు. దక్షిణ భారతదేశం అభివృద్ధిలో బీజేపీకి చిన్నచూపు ఎందుకు అని అడిగారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకు ఏమైనా ఇచ్చిందా అంటే అది కేవలం శుష్కప్రియాలు, శూన్య హస్తాలు మాత్రమే అని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని హరీష్‌రావు స్పష్టం చేశారు. అభివృద్ది పనులకు శంకుస్థాపన ఈ పర్యటన సందర్భంగాలో జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చూట్టేరు. జహీరాబాద్, పటాన్ చెరువు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటించారు. మంత్రి హరీష్‌రావు సమక్షంలో జహీరబాద్‌లో సామాజిక కార్యకర్త ఢిల్లీ వసంత్ బీఅర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం బహిరంగ సభ పాల్గొన్నారు. బర్దిపాడ్ గ్రామంలో ఆటోమొబైల్ పార్కును మంత్రి శంకుస్థాపన చేశారు. జహీరాబాద్‌లో గిరిజనులకు పోడు భూమి పట్టాలను పంపిణీ చేసి.. అనంతరం పటాన్‌చేరులో నిర్మించిన అర్ & బి గెస్ట్ హౌజ్, ఫ్రీడమ్ పార్క్‌లను మంత్రి హరీష్‌రావు ప్రారంచారు. తర్వాత సంగారెడ్డి మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి