Minister Harish Rao: అవన్నీ వారంటీ లేని గ్యారెంటీలు.. కాంగ్రెస్‌పై హరీష్ ఫైర్

కాంగ్రెస్ విజయ భేరి సభపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సభ ఆసాంతం ఆత్మవంచన, పరనిందగా సాగిందని విమర్శించారు. అల‌వికాని హామీలు, అబ‌ద్ధాల ఆరోప‌ణ‌లు, చ‌రిత్ర వక్రీక‌ర‌ణ‌ల కోసమే సభను ఏర్పాటు చేసినట్లున్నారంటూ ఎద్దేవా చేశారు.

New Update
siddipet: మహానుభావులందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నా: మంత్రి హరీష్‌రావు

Minister Harish Rao: కాంగ్రెస్ విజయ భేరి సభపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సభ ఆసాంతం ఆత్మవంచన, పరనిందగా సాగిందని విమర్శించారు. అల‌వికాని హామీలు, అబ‌ద్ధాల ఆరోప‌ణ‌లు, చ‌రిత్ర వక్రీక‌ర‌ణ‌ల కోసమే సభను ఏర్పాటు చేసినట్లున్నారంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలు దేవుడెరుగు, అస‌లు కాంగ్రెస్ కు ఓట్లు ప‌డ‌తాయ‌నే గ్యారంటే లేదంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ విజయ భేరి సభలో ఆ పార్టీ నేతలు ప్రకటించిన గ్యారెంటీలు గాలికి పోయే పేల పిండి కృష్ణార్పణం అన్నట్టుందని వ్యాఖ్యానించారు. ‘నెత్తి నాది కాదు.. కత్తినాది కాదు. అధికారంలోకి వచ్చేది ఉందా, ఇచ్చేది ఉందా’ అనుకుంటూ బూటకపు హామీలు ఇస్తున్నారని కాంగ్రెస్ తీరుపై ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. పైగా వారు చెప్పిన గ్యారెంటీలు అన్నీ కూడా సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాల్లో నుంచి కాపీ కొట్టినవే అని పేర్కొన్నారు.

అసలు మీది ఏ పార్టీ?

కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన మంత్రి హరీష్ రావు.. ‘మీది జాతీయ పార్టీనా..? ప్రాంతీయ పార్టీనా..? రాష్ట్రానికో మేనిఫెస్టో ఎందుకు..? దేశవ్యాప్తంగా హైదరాబాద్‌లో చెప్పిన గ్యారెంటీలు అమలు చేస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు..? మీ సీడబ్ల్యూసీలోనే తీర్మానం చేయవచ్చు కదా..? ఎందుకు చేయలేదు..?’ అని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ఇచ్చింది. వారెంటీలు లేని గ్యారెంటీలని విమర్శించారు. కర్నాటకలో మీరు ఇలాగే ఇచ్చి.. ఇప్పుడు వాటిని అమ‌లు చేయ‌లేక వంద రోజుల్లోనే ఆగం ఆగం అవుతున్నారని అన్నారు. కరెంటు లేదని రైతులు, పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేస్తున్నారని కర్నాటక పరిస్థితులను ఉదహరించారు మంత్రి హరీష్ రావు. ఛార్జీలు పెంచి ప్రజ‌ల న‌డ్డి విరిచారని, అక్కడ కాంగ్రెస్ ఇచ్చిన హామీల‌న్నీ అమలు చేస్తుందా? అని నిలదీశారు మంత్రి. ఏరుదాటక తెప్ప తగలబెట్టేరకం కాంగ్రెస్ నేతలు అని విమర్శించారు హరీశ్ రావు.


Also Read:

Face glow Tips: నైట్ టైమ్‌ ఇలా చేయండి.. ఉదయం నిద్రలేచే సరికి మీ చర్మం మెరిసిపోతుంది!

Ganesh Chaturthi 2023: వినాయక చవితికి ఛత్రపతి శివాజీకి, బాలగంగాధర తిలక్‌కి ఉన్న లింకేంటో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు