బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావాలని తమ వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు హరీష్‌రావు ఆర్టీవీతో పలు కీలక విషయాలు పంచుకున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోని నాయకత్వమే ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి రావాలని పరితపిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.1969లోనే కాంగ్రెస్.. తెలంగాణను కాలరాసిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని చెప్పుకునే హక్కు ఆ పార్టీకి లేదని.. ప్రజలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారని తెలిపారు.అలాగే ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 11 రోజులు అమరణ నిరాహర దీక్ష చేసిన ఘనత కేసీఆర్‌దని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి విషయాలపై అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ఆయనకు ఉన్న అవగాహన, పరిపాలనలో పోటీపడే నాయకులు ఎవరైనా ఉన్నారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలను సంపూర్ణంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
పూర్తిగా చదవండి..Harish Rao: అన్నీ చేసినం.. మళ్లీ గెలుస్తాం: హరీష్ రావు
తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోని నాయకత్వమే ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి రావాలని పరితపిస్తోందంటూ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.1969లోనే కాంగ్రెస్.. తెలంగాణను కాలరాసిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని చెప్పుకునే హక్కు ఆ పార్టీకి లేదని.. ప్రజలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారని తెలిపారు.
Translate this News: