మెచ్చుకోలంటే మనస్సు ఉండాలి..
గవర్నర్ తమిళిసైపై మంత్రి హరీష్‌రావు ఫైర్
ఉస్మానియా ఆస్పత్రిపై గవర్నర్ తమిళిసై ఆ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అని మంత్రి హరీష్‌రావు అన్నారు. 2015, జూలైలో ఉస్మానియాను సీఎం కేసీఆర్ సందర్శించారు. అప్పట్లో 200 కోట్లు ఖర్చు చేసి నూతన బిల్డింగ్ కట్టాలని నిర్ణయించారు. కొంతమంది కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. నిపుణుల కమిటీ ఒక నివేదికను కోర్టుకు నివేదించాము ఆయన తెలిపారు.
