/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/gumanuru-jayaram-1-jpg.webp)
Minister Gummanur Jayaram: కర్నూలు జిల్లాలో మంత్రి గుమ్మనూరు జయరాం వ్యవహారం అధికార పార్టీ వైసీపీని కలవరపెడుతోంది. ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి గుమ్మునురు జయరాం వైసీపీకి దూరం అవుతున్నారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. త్వరలో సొంత గూడు టీడీపీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, వీటిని మాత్రం మంత్రి గుమ్మ నూరు జయరాం కానీ.. ఆయన అనుచరులు కానీ ఎక్కడా ఖండించలేదు. దీంతో పార్టీ మార్పు కన్ ఫాం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: పోటీ చేయాలా? వద్దా?.. గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు
అంతేకాకుండా త్వరలో కర్నూలు వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. మంత్రి గుమ్మనూరు జయరాంతో పాటు ముగ్గురు జడ్పీటీసీలు, ఇద్దరు ఎంపీపీలు వైసీపీని వీడెందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. పార్టీ నిర్వహించిన సమావేశానికి దేవనకొండ జడ్పీటీసీ రామకృష్ణ, హాలహర్వి జడ్పీటీసీ లింగప్ప డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. ఆలూరు జడ్పీటీసీ చంద్రశేఖర్ హోలగుంద, హాలహార్వి ఎంపీపీలు చివరి నిమిషంలో సమావేశంలో తలుక్కు మన్నారని పలువురు నేతలు అంటున్నారు.
Also Read: షణ్ముక్ గంజాయి కేసుపై లాయర్ దిలీప్ సుంకర షాకింగ్ పోస్ట్
ఈ క్రమంలో మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీ నుండి టీడీపీలో చేరగానే అతడితోపాటు పలువురు ముఖ్యనేతలు కూడా అధికార పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. జగన్ సర్కార్ పై అసహనం వ్యక్తం చేస్తున్న వైసీపీ నాయకులను అధిష్టానం బుజ్జగిస్తున్నప్పటికి వారు మాత్రం ఏ మాత్రం తగ్గనట్లుగా కనిపిస్తోంది. మంత్రి టీడీపీలో చేరగానే వైసీపీ నుండి టీడీపీలో చేరికలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.