'20 ఏళ్ల క్రితం అత్తారింటికి దారేది అంటే విశాఖ.. 15 ఏళ్ల క్రితం అత్తారింటికి దారేది అంటే ముంబై.. 10 ఏళ్ల క్రితం అత్తారింటికి దారేది అంటే రష్యా' అంటూ పవన్ టార్గెట్‌గా మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. కాపు అడపడుచుకు 20 ఏళ్ల క్రితమే పవన్ అన్యాయం చేశారంటూ పవన్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటిస్తే ఎందుకు స్వాగతించలేదని.. గాజువాకలో ఓడిపోయారని యాత్ర చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. ఇక పవన్‌కి 10 ప్రశ్నలు సంధించారు అమర్నాథ్
1. విశాఖను పరిపాలన రాజధానిగా వ్యతిరేకించిన పవన్‌కు ఉత్తరాంధ్రలో పర్యటించే అర్హత ఉందా?
2. ఉత్తరాంధ్ర మీద పవన్‌కు సొంత ఎజెండా ఉందా?
3. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోలేదు ?
4. స్టీల్ ప్లంట్‌పై కార్మికులకు ఒక క్లారిటీ ఇవ్వాలి
5. చంద్రబాబు పాలనలో 40 గుళ్ళు కులదొస్తే ఎందుకు నోరు మెదపలేదు ?
6. కమిషన్ కోసం కక్కుర్తి పడి చంద్రబాబు పోలవరంను నాశనం చేస్తే ఎందుకు ప్రశ్నించలేదు ?
7. ప్రత్యక హోదాపై ఎందుకు మాట్లాడడం లేదు ?
8. ఉద్దనం కిడ్నీ సమస్యను పరిస్కరిస్తున్న సీఎంను ఎందుకు అభినందించ లేకపోతున్నావు?
9. వాలంటీర్ వ్యవస్థను కించపరిచిన పవన్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది.
10. పోలీసు కానిస్టేబుల్ కుమారుడిని అని చెప్పుకొనే పవన్ 40 మంది పోలీసులకు గాయలైతే ఎందుకు స్పందించలేదు ?
అలా ఎలా సీఎం అవుతారు?
కనీసం ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన నేతలు పేర్లు మీకు తెలుసా అంటూ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. విశాఖ జనసేన జిల్లా అధ్యక్షుడు ఎవరో చెప్పగలరా అని ప్రశ్నించారు. సినిమా బాగోలేక పోతే సొంత అభిమానులు కూడా చూడరని.. నీ రాజకీయాలు బాగోలేక పోతే అభిమానులు కూడా వెంట నడవరంటూ చురకలంటించారు. 25 సీట్లలో పోటీ చేసి సీఎం అవుతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు విజయనగరం పర్యటనకు 300 మంది కూడా రాలేదని విమర్శించారు అమర్నాథ్.
జనసేన నేతల రియాక్షన్:
మంత్రి అమర్నాథ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జనసేన నేతలు కోన తాతారావు, బొల్లిశెట్టి సత్యనారాయణ, శివశంకర్. మంత్రి అమర్నాథ్‌కు ప్రశ్నలు సంధించే అర్హత లేదని రివర్స్ అటాక్ చేశారు. అమర్నాథ్ అవినీతిని ఎండగడతామని కౌంటర్ వేశారు. విస్సన్నపేట భూముల కుంభకోణంలో అమర్నాథ్ ఎంత దోచుకున్నాడో వివరిస్తామని చెప్పారు.