Minister Botsa Satyanarayana: అంగన్వాడీలకు మంత్రి బొత్స గుడ్ న్యూస్ చెప్పారు. అంగన్వాడీల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. అంగన్వాడీలు వెంటనే విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. వారికి ఇచ్చే ఫైనల్ సెటిల్మెంట్ ను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ఈ నిమిషం నుంచే అమలులోకి తెస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీలు వారి సమస్యలపై 11 డిమాండ్లు ఇచ్చారని అందులో కొన్ని కేంద్రంతో ముడిపడిన అంశాలు ఉన్నాయని చెప్పారు. వాటిపై కేంద్రం నుంచి వివరాలు కోరామని వారు స్పందించిన వెంటనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అంగన్వాడీలకు భీమా 100 శాతం అమలు చేస్తామన్నారు.
Also read: క్రిస్మస్ తాత వేషంలో మంత్రి రోజా..ఏం చేశారంటే.!
అంగన్వాడీల పదవి విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. 2017 నుంచి ఇప్పటి వరకూ ఉన్న TA, DA లు పెండింగ్లో ఉన్నాయని..ఇప్పటి నుంచి ఆ అలవెన్స్ లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యనించారు. ఈ క్రమంలోనే అంగన్వాడీలు వాడుతున్న యాప్స్ ను కుదిస్తామని చెప్పారు. ఒకటి లేదా రెండు యాప్స్ లో అన్ని అంశాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణలో అంగన్వాడీలకు ఇచ్చే జీతం కంటే ఎక్కువగా ఏపీలోని అంగన్వాడీలకు జీతం ఇస్తాం అని చెప్పామని..అయితే, చెప్పినట్లే అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలు పెంచామని కానీ, తెలంగాణ అంగన్వాడీలకు జీతాలు ఎప్పుడు పెంచితే అప్పుడు పెంచుతామని చెప్పలేదని స్పష్టం చేశారు. ఇక జతం పెంచే విషయంలో ఎన్నికల తరువాతే సానుకూల నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ఈ క్రమంలోనే మంత్రి బొత్స పవన్ కళ్యాణ్, చంద్రబాబు పై హాట్ కామెంట్స్ చేశారు. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇచ్చారని మధ్యలో విడాకులు తీసుకొని జనసేన - టీడీపీ విడిపోయాయని ఇప్పుడు మళ్ళీ కలిశారని ఎద్దెవ చేశారు. ఈ నేపథ్యంలోనే తర్వలో రాజధాని తరలింపుపై వైజాగ్ వస్తామని తెలిపారు. విశాఖను పరిపాలన రాజధాని చేయాలనేదే మా విశ్వాసమని అన్నారు.