విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై మంత్రి అప్పలరాజు రియాక్షన్ ఇదే.! విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంపై మంత్రి అప్పలరాజు స్పందించారు. డామేజ్ అయినా బోటు విలువ బట్టి 80% నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రమాదానికి గల కారకులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని.. వారికి కఠిన శిక్షలు తప్పవని అన్నారు. By Jyoshna Sappogula 20 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Minister Appalaraju: విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో 40 బోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. కాగా, ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేపట్టారు. 9మంది అనుమానితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అయితే, ఈ సంఘటనపై మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని కామెంట్స్ చేశారు. ప్రమాదానికి గల వ్యక్తులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. నిందితులు ఎవ్వరైనా సరే వారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. ఘటనలో 36 బోట్లు పూర్తిగా కాలిపోగా, మరో 9 పాక్షింగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఆకతాయిలు చేసిన పనికి ఈ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. Also Read: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. రెగ్యులర్ బెయిల్ మంజూరు అయితే, గతంలో రెండు సార్లు హార్బార్ లో బొట్లు దెబ్బతిన్నాయని గుర్తి చేశారు మంత్రి అప్పలరాజు. హుద్ హుద్ తూఫాన్, తిట్లి తూఫాన్ సమయంలో బోట్లు డామేజ్ అయ్యాయని అన్నారు. కానీ, అప్పటి ప్రభుత్వం డామేజ్ బోట్లకు హామీ ఇచ్చిన నెరవేర్చలేదని విమర్శించారు. గత ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదనే ఆ భయంతో ప్రస్తుతం మత్సకారులు ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యనించారు. ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో బోట్లు ఉండడంతో తీవ్ర నష్టం జరిగిందని వాపోయారు. డామేజ్ అయినా ప్రతీ బోటు యజమానికి మత్స కారుడికి న్యాయం చేయమని సీఎం చెప్పారని తెలిపారు. డామేజ్ అయినా బోటు విలువ బట్టి 80% నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. నేవి, ఫైర్ సిబ్బంది సహాయంతో ప్రమాదం తీవ్రత ఎక్కువ అవ్వకుండా చర్యలు తీసుకున్నారని చెప్పారు. #andhra-pradesh #minister-appalaraju మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి